మీ కోరికలు నెరవేరాలంటే.. ఈ దేవాలయంలో గడియారం సిగరెట్ సమర్పించాల్సిందే..!
TeluguStop.com
ముఖ్యంగా చెప్పాలంటే మన భారత దేశంలో ఎన్నో పురాతన ఆలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.
ఈ ఆలయాలకు ప్రతిరోజు ఎన్నో వేల మంది భక్తులు తరలివచ్చి పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.
అంతేకాకుండా మరికొంత మంది భక్తులు భగవంతునికి కానుకలను సమర్పించి తమ మొక్కులను చెల్లిస్తూ ఉంటారు.
ఇంకా చాలామంది భక్తులు ఆలయాలకు వెళ్ళేటప్పుడు కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, అగర్బత్తులు, పువ్వులు తీసుకెళ్లి భగవంతుని దర్శించుకుని వస్తూ ఉంటారు.
ఏదైనా కోరికలు ఉంటే దేవాలయం చుట్టూ ప్రదిక్షణలు చేసి కొబ్బరికాయలు కొడతారు. """/" /
అలాగే దేవుడికి ముడుపులు కట్టి ప్రార్థిస్తూ ఉంటారు.
కోరికలు తీరిన తర్వాత మొక్కలు చెల్లించుకుంటారు.అయితే కొన్ని దేవాలయాలలో మాత్రం కోరికలు కోరుకున్నప్పుడే కొన్ని వింత ఆచారాలను కచ్చితంగా పాటించాలి.
కోరికలు తీరిన తర్వాత కూడా అంతే వింతగా మొక్కులు తీర్చుకోవాలి.అలాంటి ఒక దేవాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మరి ఆ దేవాలయం ఎక్కడ ఉంది? ఎలాంటి ఆచారాలు ఆ దేవాలయంలో పాటిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని( Ujjain ) జిల్లాలో అన్హేల్ రోడ్డు లో సగాస్ మహారాజ్ ఘడి వాలే బాబా దేవాలయం( Ghadi Wale Baba Temple ) ఉంది.
"""/" /
ఈ దేవాలయానికి వచ్చిన భక్తులు తమ కోరికలు నెరవేరాలని బాబా ముందు సిగరెట్ వెలిగిస్తారు.
అప్పుడు ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని అక్కడి ప్రజల నమ్మకం.కోరికలు తీరిన తర్వాత సమర్పించే గడియారాలతో( Clock ) మర్రి చెట్టు పూర్తిగా నిండిపోయి ఉండడంతో ఆ ప్రాంతమంతా టిక్ టిక్ అనే శబ్దం వస్తుంది.
అందుకే ఈ భగవంతుడిని ఇక్కడి వారు గడియారం దేవుడుగా పిలుస్తూ ఉంటారు.ఈ దేవాలయంలో పూజారులు ఎవరు ఉండరు.
ఈ ఆలయం పేరు పెద్దది అయినా ఆలయం మాత్రం చాలా చిన్నగా ఉంటుంది.
ఈ దేవాలయం పది సంవత్సరాల క్రితమే వెలుగులోకి వచ్చింది.ఇక్కడికి వచ్చిన భక్తుల కోరికలు తీరడంతో ఆ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది.
తల్లీ కూతురుతో రొమాన్స్ చేసిన సీనియర్ ఎన్టీఆర్.. ఈ రికార్డ్ ఈ స్టార్ హీరోకే సొంతం!