విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయానికి పోటేత్తిన భక్తులు..?
TeluguStop.com
ముఖ్యంగా చెప్పాలంటే ఇంద్రకీలాద్రి( Indrakiladri ) పై భక్తులు రద్దీగా ఉన్నారు.విజయవాడ ఇంద్రకీలాద్రి పై వేంచేసిన బంగారు తల్లి దుర్గాదేవి శరన్నవ ఉత్సవాలు అంగరంగ వైభవంగా అంబరాన్ని తాకే రీతిలో జరుగుతున్నాయి.
ఇంకా చెప్పాలంటే విజయవాడ కెనాల్ రోడ్ నుంచి ఇంద్రకీలాద్రి పై భక్తులు బారులు తీరారు.
జగజ్జనని దర్శన భాగ్యంతో భక్తజనం పులకరించి పోతున్నారు.అలాగే ప్రతిరోజు లక్ష మంది భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తున్నట్లు దేవాలయ ముఖ్య అధికారులు చెబుతున్నారు.
అలాగే తొలి రోజు భక్తులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మరింత శ్రద్ధగా విధి నిర్వహణలో పాల్గొనాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
"""/" /
భక్తులకు మంచినీరు, మజ్జిగ, వితరణ పంపిణీ నిర్వహించారు.ఆరోగ్య సమస్యలు( Health Problems ) ఉన్న భక్తుల కోసం వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దసరా శరన్నవరాత్రి మహోత్సవాల( Sharannavaratri Celebrations ) సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ భద్రత ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే అమ్మవారి దర్శనానికి ప్రముఖులు వస్తుండడంతో దేవాలయ పరిసర ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేసి ఈయన భద్రత ఏర్పాట్లను ఇతర అధికారులతో కలిసి స్వయంగా నగర కమిషనర్ పర్యవేక్షిస్తున్నారు.
ఈ సందర్భంగా కనకదుర్గ అమ్మవారి దేవాలయం క్యూ లైన్ లను తనిఖీ చేసి భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటున్నారు.
"""/" /
అంతరాలయం లో విధులు నిర్వహిస్తున్న అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేస్తున్నారు.
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అందరికీ అమ్మవారి దర్శనం కలిగేలా జాగ్రత్త పడుతున్నారు.
అదే విధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయము చేసుకొని పటిష్ట బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు.
అలాగే శ్రీ కనకదుర్గ అమ్మవారి ఉత్సవ మూర్తుల నగర ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆ తర్వాత వృద్ధులు, దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శనం చేసుకునేందుకు వారి కోసం పోలీస్ సేవాదళ్ పేరుతో సిబ్బందిని కేటాయించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ అధికార సిబ్బంది అంతా పాల్గొన్నారు.
రూ.10 కోసం ఐఏఎస్ అధికారిని కొట్టిన బస్సు కండక్టర్.. వీడియో వైరల్!