బద్ది పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు!

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీబద్ది పోచమ్మ అమ్మవారి ఆలయానికి ( Baddi Pochamma Temple )మంగళవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా బోనాల మొక్కులు చెల్లించుకునేందుకు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయంతోపాటు పరిసరప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి.

అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలను, బోనాల ( Bonalu )నైవేద్యాలను సమర్పించుకొని సేవలో తరించారు.

తమ ఇంటిల్లిపాదినీ పిల్లాపాపలను చల్లగా చూడు తల్లి అంటూ అమ్మవారిని భక్తులు వేడుకున్నారు.

ఆడోళ్లు చూడకపోయినా సెన్సేషనల్ హిట్టైన కృష్ణ మూవీ.. ఏదంటే..?