కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా వాడపల్లికి తెల్లవారుజాము నుంచి పోటెత్తిన భక్తులు

ఉగాది సందర్బంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా వాడపల్లికి తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తారు.

ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఆలయాన్ని ప్రత్యేకంగా పూలుతో అలంకరించారు.ఇవాళ శనివారం కూడా కావడంతో భక్తులు రద్దీకి తగినట్లుగా వాడపల్లి ఆలయంలో ఏర్పాట్లు చేశారు.

అన్నవరం, అయినవల్లి, అంతర్వేది సహా జిల్లాలో అన్ని ప్రముఖ ఆలయాల్లోనూ ఉగాది సందర్బంగా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనాలు చేసుకుంటున్నారు.

శుభకృత్ నామ సంవత్సరంలో అంతా శుభం జరగాలని కోరుకుంటున్నారు.అన్ని ఆలయాల్లో పండితులతో పంచాంగ శ్రవణాలు జరగనున్నాయి.

మెడ న‌లుపుతో వ‌ర్రీ వ‌ద్దు.. ఇవి ట్రై చేయండి..!