ఈ పుణ్యక్షేత్రానికి సంప్రదాయా దుస్తువులలోనే రావాలని భక్తులకు విజ్ఞప్తి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయినా మహానంది పుణ్యక్షేత్రనికి సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలని దేవాలయ అధికారులు వెల్లడించారు.

మహానంది పుణ్యక్షేత్రం సాక్షాత్తు పరమేశ్వరుడే స్వయంగా వెలిసిన ఈ క్షేత్రంలోని స్వామి వారిని దర్శించుకోవాలంటే ఇప్పటి నుంచి సంప్రదాయమైన దుస్తులు ధరించాల్సిందే అని భక్తులకు ఆలయ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

దేవాలయ గర్భగుడిలోకి వచ్చే భక్తులకు ఈ డ్రెస్ కోడ్ ను అమలు చేయాలని ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి మరియు చైర్మన్ మహేశ్వర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయాలు దుస్తులను ధరించాలని వెల్లడించారు.నంద్యాల జిల్లాలోని మహానంది పుణ్యక్షేత్రంలో ఈ సాంప్రదాయమైన డ్రెస్ కోడ్ అమల్లోకి తెచ్చారు.

దైవ దర్శనానికి వచ్చే భక్తులంతా సాంప్రదాయా దుస్తులు ధరించి దర్శనాలు చేసుకోవాలని ఆలయ ధర్మకర్తల మండలి నిర్ణయించింది.

ఇప్పటి నుంచి మహిళా భక్తులు చీర లేదా చున్నీ ఉన్నా చుడిదార్ ధరించి దర్శనాలకు రావాలని, అట్లాగే పురుషులు పంచే లాంటి సంప్రదాయ దుస్తులు ధరించాల్సిందేనని ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి మరియు చైర్మన్ మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు.

"""/"/ అంతేకాకుండా భక్తులు సంప్రదాయ దుస్తులను ధరించే విధంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చైర్మన్ మరియు ఈవో వెల్లడించారు.

ధర్మకర్తల మండలి తీసుకున్న ఈ నిర్ణయాన్ని భక్తులు గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.అయితే ఇప్పటికే ఈ సంప్రదాయ దుస్తుల డ్రెస్ కోడ్ ప్రముఖ తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ దుర్గమ్మ గుడి తో పాటు దక్షిణ భారత దేశంలోని పలు దేవాలయాల్లో అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.

ఇలాంటి సంప్రదాయమైన డ్రెస్ కోడ్ అమల్లోకి తీసుకురావడం అనేది మంచి విషయమే.దీనివల్ల మన ఆచారాలను సంప్రదాయాలను కట్టుబాట్లను ఎప్పటికీ గుర్తు పెట్టుకునే వీలు ఉంటుంది.

కల్కి పార్ట్ 2 పై కీలక అప్డేట్ ఇచ్చిన నిర్మాత…అప్పుడే షూటింగ్ పూర్తి అంటూ?