నేటి సాయంత్రం నుంచి శబరిమలలో భక్తులకు అనుమతి

కేరళలోని పంపానదీ తీరంలో కొలువైన శబరిమల అయ్యప్ప స్వామి వారి దేవాలయం సుదీర్ఘ విరామం తర్వాత ఇవాళ సాయంత్రం తెరుచుకోనుంది.

పూజాదికాలు, ఆచార సంప్రదాయాల అనంతరం భక్తులను అనుమతించనున్నారు.వార్షిక మండలం -మకరవిళక్కు పవిత్ర యాత్ర నవంబర్ 17 నుంచి ప్రారంభమవుతోంది.

41 రోజులపాటు కొనసాగే మండల దీక్ష డిసెంబర్ 27న ముగియనుంది.అనంతరం డిసెంబర్ 30న అయ్యప్ప ఆలయం తిరిగి తెరుచుకోనుందని తెలుస్తోంది.

జనవరి 14 వరకు మకరవిళక్కు దీక్షలు కొనసాగగా.జనవరి 20న ఆలయాన్ని మూసివేస్తారు.

మరోవైపు స్వామివారి దర్శనాల కోసం భక్తులకు ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ నేపథ్యంలో వెబ్ సైట్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చని ట్రావెన్ కోర్ దేవస్థానం తెలిపింది.

ఆన్ లైన్ లో దర్శనం బుక్ చేసుకోలేకపోయిన వారు ప్రత్యేక కౌంటర్ల ద్వారా బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

ఈ మేరకు నీలక్కల్ ప్రాంతంలో 10 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు.

బాలయ్య బోయపాటి మూవీ అఖండ2 రిలీజ్ అప్పుడేనా.. నందమూరి హీరోల టార్గెట్ ఇదే?