వైసీపీ నాయకుల మాటలను ఎవరు నమ్మటం లేదంటూ దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు..!!
TeluguStop.com
ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్( YS Jagan ) గురువారం విజయవాడ ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లడం తెలిసిందే.
ఈ క్రమంలో ఎన్నికలలో వైసీపీ కోసం పనిచేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.కచ్చితంగా 2019 కంటే ఈసారి ఎక్కువ స్థానాలలో గెలుస్తున్నట్లు స్పీచ్ ఇవ్వడం జరిగింది.
జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ( Devineni Uma ) స్పందించారు.
శుక్రవారం ఎన్టీఆర్ భవన్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ.జగన్ మాటలు వైసీపీ పార్టీకి( YCP ) చెందిన వాళ్లు సైతం నమ్మటం లేదని అన్నారు.
"""/" /
అందువల్లే సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.
పెద్దారెడ్డి ఇంటిపై మేమే దాడి చేశామని సీసీ కెమెరాలు పగలగొట్టామని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ మాటలను ఎవరు నమ్మటం లేదు కాబట్టి చాలామంది వైసీపీ నాయకులు.రాష్ట్రం విడిచి వెళ్ళిపోతున్నారని వాళ్ళ కంపెనీల వాహనాలు బయటకు పంపించేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
"""/" /
కేఏ పాల్ ఆత్మవిశ్వాసం ఏ స్థాయిలో ఉందో జగన్ మాటలలో ఆత్మవిశ్వాసం కూడా అదే స్థాయిలో ఉంది.
కాబట్టి పిచ్చి ప్రేలాపనులు మానేయండి.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.
( Land Titling Act ) మీ కొంప ముంచింది.మీ ప్రచార పిచ్చి ఫోటోలు పిచ్చి కారణంగా.
మీరు తెచ్చిన చట్టాలే మీ ప్రభుత్వానికి ఉరితాళ్ళు అయ్యాయి అని దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లకు సిఎస్ జవహర్ రెడ్డి( CS Jawahar Reddy ) బాధ్యత వహించాలని అన్నారు.
ఏ అధికారులు అయితే తప్పులు చేస్తున్నారో భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
బకింగ్‌హామ్ ప్యాలెస్ పనిమనిషి అరెస్ట్.. ఏం తప్పు చేసిందో తెలిస్తే..