వైసీపీ జెండా కప్పేసుకున్న దేవినేని అవినాష్

వైసీపీ మీద ప్రతిపక్షాలు ఒక పక్క ఎదురుదాడి చేసి కార్నర్ చేస్తున్న సమయంలో హఠాత్తుగా ఏపీ టీడీపీ కీలక నాయకులు వైసీపీ కండువా కప్పుకోవడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు.

తాజాగా తెలుగుదేశం పార్టీకి, తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అవినాష్ ఈ సాయంత్రం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

అవినాష్ కు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు సీఎం వైఎస్ జగన్.

దేవినేని అవినాష్‌తో పాటు కడియాల బుచ్చిబాబు కూడా వైసీపీలో చేరారు.నమ్ముకున్న కార్యకర్తల కోసమే తాను పార్టీ మారినట్టు అనంతరం మీడియాకు వెల్లడించారు.

తాను పదవుల కోసం పార్టీలో చేరలేదని ఆయన క్లారిటీ ఇచ్చాడు.నవరత్నాలు పథకం తనను బాగా ఆకట్టుకుంది అంటూ చెప్పాడు అవినాష్.