అజ్మల్ కసబ్‌ను గుర్తించిన ఈ పాప గుర్తుందా.. రతన్ గురించి ఏం చెప్తుందో వినండి..!
TeluguStop.com
రతన్ టాటా( Ratan Naval Tata ) చాలా గొప్పవారు, అచ్చమైన భారత రత్నం.
ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు.ఇండియాలో ఆయన్ని ద్వేషించేవారు లేరంటే అతిశయోక్తి కాదు.
అయితే పాకిస్థానీ టెర్రరిస్టులు మాత్రం ముంబై తాజ్ హోటల్‌పై దాడి చేసి రతన్ టాటాకు చాలా బాధ కలిగించారు.
ఈ దాడి గురించి తెలిసిన వెంటనే ఆయన హోటల్ వద్దకు వెళ్లి, అందులో ఉన్న గెస్టులను కాపాడేందుకు పోలీసులకు కావలసిన సహాయాలన్నీ అందించారు.
ఈ దాడి జరిగినప్పుడు ఆ హోటల్లోని సిబ్బంది ఎవరూ కూడా పారిపోలేదు.అతిథుల ప్రాణాలను రక్షించడమే తమ బాధ్యత అని భావించారు.
వారందరికీ హోటల్ నుంచి వెళ్లిపోయే అన్ని రకాల ఎగ్జిట్ రూట్స్ తెలుసు.అయినా సరే వాళ్లు అతిధులను రక్షించడానికి అక్కడే ఉండిపోయారు.
ప్రాణాలను కూడా పణంగా పెట్టేలా వారికి టాటా ట్రైనింగ్ ఇచ్చింది.టాటా సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరికి అలాంటి విలువలు ఉంటాయని చెప్పుకోవచ్చు.
"""/" /
అతిథులను రక్షించే క్రమంలో చాలామంది తాజ్ హోటల్ ఉద్యోగులు చనిపోయారు.
కొంతమంది గాయపడ్డారు.టాటా ట్రస్ట్ ఆ బాధిత కుటుంబ సభ్యులందరికీ అండగా నిలిచింది, చదువులు చెప్పించింది.
ఉద్యోగాలు కూడా ఇచ్చింది.పెళ్లిళ్లు కూడా చేసింది.
అంతేకాదు హోటల్ పరిసరాల్లో ఉంటూ టెర్రరిస్టుల దాడిలో నష్టపోయిన కుటుంబాలను ఆదుకుంది.ఈ టెర్రరిస్టుల దాడిలో సర్వైవ్ అయిన వారిలో దేవిక అనే చిన్న పాప కూడా ఉంది.
ఆమెతో పాటు అక్కడికి వచ్చిన ఆమె తండ్రి, మామయ్యలను టెర్రరిస్టులు చంపేశారు. """/" /
ఈ దాడి సమయంలో పాకిస్థానీ టెర్రరిస్టు అజ్మల్ కసబ్( Ajmal Kasab) హోటల్లో వందల మందిని చంపాడు.
ఈ అజ్మల్ కసబ్‌ను గుర్తించింది ఈ చిన్న పాపే.ఆ చిన్న పాప కూడా బుల్లెట్లు తగిలి తీవ్ర గాయాల పాలయ్యింది.
ఆమె గురించి తెలిసిన రతన్ టాటా వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసి ఆమె కోలుకునే వరకు ఉచితంగా చికిత్స అందించారు.
ఆ చిన్నారి పేరు దేవిక రొతవాన్.టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు ఆమె వయస్సు కేవలం తొమ్మిదేళ్లు.
ఆ సమయంలో ఆమె హోటల్‌లో లేదు.వాళ్లకు అందులో దిగే స్థోమత లేదు.
ఆమె తండ్రి నట్వర్‌లాల్ డ్రైఫ్రూట్స్ అమ్మేవాడు.అయితే ఓ రోజు హోటల్ లోపలికి రావడం, అప్పుడే దాడి జరగడం జరిగిపోయింది.
ఆమె కాలిలోకి కూడా ఓ బుల్లెట్ కూడా దూసుకుపోయింది.టాటా ట్రస్టు ఆమెకు గ్రాడ్యుయేషన్ దాకా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇప్పించింది.
ట్రస్టు వారి కుటుంబానికి ఆర్థిక సాయం కూడా చేసింది.దాడి తరువాత రాజస్థాన్ వెళ్లిపోయారు కానీ టెర్రరిస్ట్ అటాక్ కేసు విచారణ నిమిత్తం ముంబైకి వచ్చింది.
మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ఇల్లు వారికి కట్టించి ఇస్తామని చెప్పింది కానీ మాట తప్పింది.
హైకోర్టులో ఆమె పోరాటం చేసింది.అయితే ఆమెకు నిజంగా అనేక విధాలుగా అండగా నిలిచింది ఒక టాటా ట్రస్ట్ మాత్రమే.
ఆ విషయాన్ని తాజాగా ఆమె ఒక న్యూస్ మీడియా ముందుకు వచ్చి వెల్లడించింది.
రతన్ టాటా దేవుడని ఆమె పొగిడింది కూడా.https://x!--com/TimesNow/status/1844439026096336994 ఈ లింక్ పై క్లిక్ చేసి ఆ అమ్మాయి రతన్ టాటా గురించి ఎంత గొప్ప మాటలు చెప్పిందో వినొచ్చు.
ఈ బాలిక పలు టీవీ షోల్లో కూడా పాల్గొన్నది.రాహుల్ గాంధీ పాదయాత్రలో కూడా పాటిస్పేట్ చేసింది.