పుష్ప3 ఐటమ్ సాంగ్ లో ఆ హీరోయిన్ కనిపించనున్నారా.. ఆమె ఓకే అంటారా?

టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక మందన (Allu Arjun ,Rashmika Mandanna)కలిసి నటించిన చిత్రం పుష్ప.

ఈ సినిమా రెండు భాగాలుగా ఇప్పటికే విడుదల అయ్యి సంచలన విజయాలను అందుకున్న విషయం తెలిసిందే.

ఇప్పటివరకు ఉన్న రికార్డులను సైతం బద్దలు కొట్టి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది పుష్ప సినిమా.

ఇటీవల ఈ సినిమా పార్ట్ 2 విడుదలైన విషయం తెలిసిందే.డిసెంబర్ 5వ(December 5th) తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది.

ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.అయితే పుష్ప 2 (Pushpa 2)సినిమా ప్రమోషన్స్ సమయంలోనే పార్ట్ 3 (Part 3)ఫై చాలా రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

"""/" / ఈ విషయంపై సుకుమార్ స్పందిస్తూ మీ హీరో ఒప్పుకుంటే, మరో మూడేళ్లు సమయం ఇస్తే తప్పకుండా పుష్ప 3 తీస్తాను అని తెలిపారు.

దాంతో ఆ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అయితే పుష్ప 2 విడుదల అయ్యి సంచులను విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు పుష్ప 3కి సంబంధించిన వార్తలు మొదలయ్యాయి.

అందులో భాగంగానే పుష్ప 3 (Pushpa 3)సినిమాకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది.

అదేమిటంటే పుష్ప 3 సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌లో నటి జాన్వీ కపూర్‌ (Actress Janhvi Kapoor, Item Song)డ్యాన్స్‌ వేస్తే బాగుంటుందని దేవిశ్రీ ప్రసాద్‌ అభిప్రాయపడ్డారు.

తాజాగా ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడారు.ఈ సందర్భంగా దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.

పుష్ప 2 (Pushpa 2)సినిమాలోని స్సిక్‌ పాటలో ఎవరు నటించినా అంతర్జాతీయ స్థాయిలో పాపులర్‌ అవుతారని మాకు ముందే తెలుసు.

"""/" / శ్రీలీల(Srileela) అద్భుతమైన డ్యాన్సర్‌ కాబట్టి ఆమెను తీసుకుంటే బాగుంటుందని మేకర్స్‌ కు చెప్పాను.

ఎంతో మంది అగ్ర హీరోయిన్ లు మొదటిసారి నా కంపోజిషన్‌ లోనే ప్రత్యేక గీతాల్లో అలరించారు.

పూజా హెగ్డే, సమంత, శ్రీలీల, కాజల్‌ అగర్వాల్‌ వీళ్లందరూ అగ్ర స్థానంలో ఉన్నప్పుడే ఐటెమ్‌ సాంగ్‌ ల్లో నటించారు.

ఇక పుష్ప 3 సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ లో కనిపించేవారి గురించి ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

దీనిపై దర్శక నిర్మాతలు తుది నిర్ణయం తీసుకుంటారు.పాట ఆధారంగా హీరోయిన్‌ ను ఎంపిక చేస్తారు.

మంచి డ్యాన్సర్లు అయితే బాగుంటుంది.సాయి పల్లవి డ్యాన్స్‌ కు నేను అభిమానిని.

అలాగే జాన్వీ కపూర్‌ అద్భుతమైన డ్యాన్సర్‌.ఆమె పాటలు కొన్ని చూశాను.

శ్రీదేవిలో ఉన్న గ్రేస్‌ ఆమెలో ఉంది.జాన్వీ అయితే ఆ పాటకు సరైన ఎంపిక అని నేను అనుకుంటున్నాను.

ఇలాంటి పాటలు హిట్ కావడానికి డ్యాన్స్‌ కూడా ముఖ్య కారణం అని చెప్పుకొచ్చారు దేవిశ్రీప్రసాద్.

ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మూవీ ఆఫర్లు ఇస్తామని చెప్పి అలా ప్రవర్తించారు.. నిధి సంచలన వ్యాఖ్యలు వైరల్!