పుష్ప 2 పై డిఎస్పీ ఆ రేంజ్ కామెంట్స్.. ప్రతీ సీన్ ఓ ఇంటర్వెల్ అంటూ..

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలలో ''పుష్ప ది రూల్''( Pushpa The Rule ) ఒకటి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీ లెవల్లో ఉన్నాయి.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా పార్ట్ 1 సౌత్ మాత్రమే కాదు నార్త్ వాళ్ళను కూడా ఆకట్టుకుంది.

అందుకే ఈసారి పార్ట్ 1 ను మించి సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

ఇక పార్ట్ 2 గురించి లేటెస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ డిఎస్పీ ( Devi Sri Prasad ) చెప్పిన మాటలతో మరిన్ని అంచనాలు పెరిగాయి.

సుకుమార్ పార్ట్ 2 కథను తనకు, చంద్రబోస్ కు చెప్పారని ఆ కథ విన్నప్పుడే ఆ స్క్రీన్ ప్లే ప్రతీ సీన్ ఇంటర్వెల్ బ్యాంగ్ లాగ ఉంటుందని అన్నారు.

"""/" / ఈ మాటలే ఇప్పుడు ఈ సినిమాపై మరింత హైప్ పెరిగేలా చేసాయి.

అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు కూడా ఈ మాటలు తేనే పోసినట్టు ఉన్నాయనే చెప్పాలి.

ఇలాంటి మాటలు కదా మాకు కావాల్సింది అంటూ ఆ క్లిప్ ను తెగ షేర్ చేసేస్తున్నారు.

దీంతో దేవి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. """/" / ఇక పుష్ప సినిమాలో జాతర సీక్వెన్స్ ఈ సినిమాకు హైలెట్ గా ఉండబోతుంది అని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.

ఈ జాతర ఎపిసోడ్ ఇప్పటికే షూట్ కూడా పూర్తి అయ్యింది.కాగా ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

అలాగే ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

DOGE నుంచి తప్పుకోవడంపై వివేక్ రామస్వామి స్పందన .. మస్క్‌‌పై షాకింగ్ కామెంట్స్