దేవి నాగవల్లి లో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా…? బిగ్ బాస్ హౌస్ లో నవ్వులే నవ్వులు…!
TeluguStop.com
తెలుగు లో బిగ్ బాస్ 4 సీజన్ మొదటి వారం దాటి రెండవ వారంలో కి అడుగుపెట్టింది.
మొదటి వారం మొత్తం ఏడుపులు, గోలలతో చప్పగా సాగినా, ఇక ఇప్పుడు రెండో వారం లోకి అడుగు పెట్టిన బిగ్ బాస్ షో ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతోంది.
ఇక రెండవ వారం సంబంధించి నిన్న నామినేషన్ ప్రక్రియ జరగగా అందులో మొత్తం 9 మంది సభ్యులు నామినేట్ అయ్యారు.
ఈ తొమ్మిది మందిలో అమ్మ రాజశేఖర్, నోయల్, కరాటే కళ్యాణి, గంగవ్వ, మోనాల్ గజ్జర్, హారిక, అభిజిత్, కుమార్ సాయి, సోహెల్ ఉన్నారు.
వైల్డ్ కార్డు తో ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి కూడా మొదటిరోజే నామినేషన్ లోకి వచ్చాడు.
ఇకపోతే మంగళవారం ఎపిసోడ్ కు సంబంధించి ఓ ప్రోమో ని విడుదల చేసింది స్టార్ మా.
ఇక ఆ ప్రోమో లో బిగ్ బాస్ హౌస్ లో సభ్యులు అందరూ చిత్ర విచిత్ర గెటప్ లతో కనిపిస్తున్నారు.
అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో కాస్త హడావిడి కూడా జరిగినట్లు అర్థమవుతోంది.
ఇక ఇందులో పక్కా పల్లెటూరి వేషధారణ వేసుకున్నట్లు టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి కనబడుతుంది.
అంతే కాదు ఆమె కాస్త వెరైటీగా కూడా సెటైర్లు వేసినట్లు కనిపిస్తోంది." ఆ అబ్బాయి చూడడానికి అలా ఉన్నాడు గాని.
పేపర్ పై అమ్మాయి అని రాసి ఉన్న వదిలిపెట్టడు " అంటూ ఎవరో కంటెస్టెంట్ పై భారీ సెటైర్ వేసింది.
దీంతో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సభ్యులు అందరూ పగలబడి నవ్వారు.
ఇక సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ కూడా కాస్త భిన్నంగా స్పందిస్తున్నారు.
కొంతమంది నెటిజెన్స్ దేవి నాగవల్లి లో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరికొందరు దేవి మీరు అన్నది అమ్మ రాజశేఖర్ నే కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరికొందరైతే దేవి అద్భుతంగా బిగ్ బాస్ గేము ను ఆడుతున్నట్లు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.
పగుళ్లను మాయం చేసి పాదాలను మృదువుగా మార్చే ఎఫెక్టివ్ ఇంటి చిట్కాలు మీకోసం!