చంద్రగిరి తరహాలోనే ఒంగోలు అభివృద్ధి..: వైసీపీ నేత చెవిరెడ్డి

ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ నేతల ఆత్మీయ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ( Chevireddy Bhaskar Reddy )కీలక వ్యాఖ్యలు చేశారు.

తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని చెప్పారు.చంద్రగిరి నియోజకవర్గాన్ని( Chandragiri Constituency ) ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు.

చంద్రగిరిని అభివృద్ధి చేసినట్లే ఒంగోలు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తానని చెవిరెడ్డి తెలిపారు.

ఒంగోలు రూపురేఖలు మార్చడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.అందుకోసమే తాను చంద్రగిరిని వదిలి వచ్చానని తెలిపారు.