వైసీపీ పాలనలో అభివృద్ధి కరువు..: అశోక్ గజపతిరాజు

వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

యువగళంలో ప్రజా సమస్యలను నారా లోకేశ్ వెలుగులోకి తెస్తున్నారని పేర్కొన్నారు.వైసీపీ పాలనలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదని అశోక్ గజపతి రాజు తీవ్రంగా ఆరోపించారు.

ఒక్క కంపెనీ కూడా రాష్ట్రానికి రాలేదన్న ఆయన ఉన్న వాటిని సైతం తరిమేశారని విమర్శించారు.

ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టేశారని మండిపడ్డారు.ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.