వికలాంగుడు సైగ చేస్తే కారు దిగిన ఎమ్మెల్యే…!

నల్లగొండ జిల్లా: ప్రస్తుతం రాజకీయాల్లో ప్రజా ప్రతినిధుల తరీఖా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.

వార్డు మెంబర్ అయితే చాలు వెంటనే అతనికి రెండు కొమ్ములు మొలిచి ఎవరి మాటా వినరు.

తానే అన్నీ అనే గర్వంతో కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తూ ఉంటారు.ఇక ఎంపిపి,జెడ్పీటీసీ,ఎమ్మెల్యే,ఎంపి,మంత్రి అయితే వారి గురించి చెప్పనక్కర్లేదంటే అతిశయోక్తి కాదేమో.

!కానీ,నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూ నాయక్ తీరుతో నెటిజన్లు శభాష్ ఎమ్మెల్యే అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

గురువారం నల్లగొండ జిల్లా డిండి మండలం కేంద్రంలో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా మార్గం మధ్యలో బాపన్ కుంట వద్దా జేత్యతండాకు చెందిన రామావత్ జవహర్ లాల్ అనే వికలాంగుడు ఎమ్మెల్యే బాలునాయక్ కాన్వాయ్ చూసి ఎమ్మెల్యేతో తన సమష్యను చెప్పుకోవడానికి కారుని ఆపమని చెయ్యి ఎత్తగానే తన కాన్యాయ్ ని ఆపీ కారుదిగి తన సమస్యను పూర్తిగా విన్న తర్వాత వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

దీనితో అక్కడ ఉన్నవారు,ఈ విషయం తెలిసిన వారు వీళ్ళు కదా ప్రజా ప్రతినిధులు అంటే అని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

బానిసత్వ పరిస్ధితుల్లో భారతీయ కార్మికులు : ఇటలీ పోలీసుల ఆపరేషన్‌లో 33 మందికి విముక్తి