దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!
TeluguStop.com
ఈ నెల 16వ తేదీన బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి.
బాలీవుడ్ ఇండస్ట్రీలో సైఫ్ అలీ ఖాన్ కు మంచి గుర్తింపు ఉంది.ఆదిపురుష్ లో( Adipurush ) రావణుని పాత్రలో నటించి కొంతమంది చేత విమర్శల పాలైన సైఫ్ అలీ ఖాన్ దేవర సినిమాలో( Devara Movie ) భైరా అనే పవన్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు.
సైఫ్ అలీ ఖాన్ దగ్గర ఖరీదైన కార్లు కూడా ఉన్నాయని సమాచారం అందుతోంది.
1970 సంవత్సరంలో జన్మించిన సైఫ్ పటౌడీ సంస్థానం నవాబుల కుటుంబానికి చెందిన వ్యక్తి.
1991 సంవత్సరంలో సైఫ్ అమృతా సింగ్ ను( Amruta Singh ) పెళ్లి చేసుకున్నారు.
2004లో ఈ జంట విడాకులు తీసుకున్నారు.2012 సంవత్సరంలో సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ ను( Kareena Kapoor ) పెళ్లాడారు.
1993 సంవత్సరంలో సైఫ్ అలీ ఖాన్ నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టి ఎన్నో గుర్తుండిపోయే సినిమాలలో నటించి తన నటనతో ఆకట్టుకున్నారు.
"""/" /
రియల్ ఎస్టేట్ రంగంలో( Real Estate ) సైఫ్ పెట్టుబడులు పెట్టారని సైఫ్ దగ్గర కోట్ల రూపాయల విలువ చేసే బంగ్లాలు కూడా ఉన్నాయని సమాచారం అందుతోంది.
సైఫ్ కు స్విట్జర్లాండ్ లో ఫాం హౌస్ ఉండగా ఆ ఫాం హౌస్ విలువ 33 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.
సైఫ్ అలీఖాన్ వారసత్వ సంపద 5000 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.
"""/" /
75 లక్షల రూపాయల నుంచి 4 కోట్ల రూపాయల వరకు ఖరీదైన కార్లు( Luxury Cars ) సైఫ్ అలీ ఖాన్ దగ్గర ఉన్నాయని సమాచారం అందుతోంది.
సైఫ్ ఒకానొక సందర్భంలో తన భార్య కరీనాకు కోటి రూపాయల ఖరీదైన వాచ్ ను బహుమతిగా ఇచ్చారు.
సైఫ్ అలీ ఖాన్ సొంత ఆస్తుల విలువ 1200 కోట్ల రూపాయలు అని సమాచారం.
సైఫ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
నన్ను తీసేసి నా ప్లేస్ లో ఒక శునకాన్ని పెట్టుకున్నారు.. శోభిత సంచలన వ్యాఖ్యలు వైరల్!