అభిమానుల కోసం బెన్ ఫిట్ షోస్, ఫ్యాన్స్ షోస్ ప్లాన్ చేస్తున్న దేవర యూనిట్…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ).
ప్రస్తుతం ఆయన దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫ్యాన్స్ షోస్ ని కూడా వేయడానికి డిస్ట్రిబ్యూటర్లు ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ముఖ్యంగా నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 42 కోట్లకు కొనుగోలు చేయడం వలన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమాకు సంబంధించిన ఫ్యాన్స్ షోస్ ని ముందు నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది.
"""/" /
ఇక అందులో భాగంగానే ఈ సినిమాకి టికెట్ రెట్ కూడా పెంచుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది.
కాబట్టి ఈ సినిమా కోసం భారీ ఎత్తున కసరత్తులైతే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మీద అందరికీ చాలా మంచి క్రేజ్ అయితే ఉంది.
ఎందుకంటే ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి.ముఖ్యంగా మాస్ సినిమాలను తీయడం లో ఆయన మీద ప్రత్యేకమైన అభిమానం అయితే ఉంటుంది.
ఎందుకంటే మొదట్లో ఆయన మొత్తం మాస్ సినిమాలనే చేశారు.వాటి వల్లే ఆయనకు క్రేజ్ కూడా ఎక్కువగా పెరిగింది.
"""/" /
మరి ఇలాంటి సందర్భంలో దేవర సినిమా ( Devara Movie )కూడా మాస్ ప్రేక్షకులను అలరించే సినిమా కావడంతో ఈ సినిమా కోసం బీ, సీ సెంటర్లలో అభిమానులు తీవ్ర స్థాయిలో ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
అలాగే భారీ కటౌట్లను కూడా కడుతూ వాళ్ళ అభిమానాన్ని తెలియజేయడానికి వాళ్ల సిద్ధంగా ఉన్నారు.
ఇక బెనిఫిట్ షోస్ కూడా ఈ సినిమాకి చాలావరకు ఉపయోగపడనున్నాయి.కానీ వీటి ద్వారా మాత్రమే సినిమాకి అలాగే డిస్ట్రిబ్యూటర్ కి భారీ లేబల్లో లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.
ఇక ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం అందరూ సేఫ్ జోన్ లో ఉంటారు.
మా అమ్మకు ఫోన్ చేసి నేను ఏడ్చేశాను.. అందుకే ఎలిమినేట్.. దివి కామెంట్స్ వైరల్!