దేవర తెలంగాణ మిడ్ నైట్ షోల వివరాలివే.. ఆ థియేటర్లకు మాత్రమే అనుమతి దక్కిందా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో దేవర మూవీ( Devara Movie ) ప్రదర్శితం అవుతున్న సంగతి తెలిసిందే.

దేవర సినిమా నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కాగా ఈ సినిమాకు తెలంగాణ సర్కార్ నుంచి ప్రత్యేక అనుమతులు వచ్చాయి.

తాజాగా ఇందుకు సంబంధించిన జీవో విడుదలైంది.నైజాంలో దేవర మూవీ అర్ధరాత్రి ఒంటి గంట షో నుంచి ప్రదర్శితం కానుందని సమాచారం అందుతుండటం గమనార్హం.

"""/" / మొత్తం 29 థియేటర్లలో దేవర షోలు ప్రదర్శితం కానుండగా ఆయా థియేటర్లలో 100 రూపాయల వరకు టికెట్ రేటును పెంచుకోవచ్చని చెప్పారని భోగట్టా.

ఖమ్మంలో ఐదు థియేటర్లకు అనుమతులు లభించగా మహబూబ్ నగర్, గద్వాల్, మిర్యాలగూడలో మిడ్ నైట్ షోలకు అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తోంది.

మిగతా 21 థియేటర్లు హైదరాబాద్ లో ఉన్నాయి. """/" / హైదరాబాద్( Hyderabad ) లో ఉన్న ప్రతి మెయిన్ థియేటర్ లో మిడ్ నైట్ షోలు ప్రదర్శితం కానున్నాయి.

ఈ జాబితాలో ఏఎంబీ సినిమాస్, పీవీఆర్, ప్రసాద్స్ లాంటి మల్టీప్లెక్స్ లు ఉన్నాయని సమాచారం అందుతోంది.

సాధారణ షోలకు మల్టీప్లెక్స్ లలో 50 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 25 రూపాయలు పెంపు ఉండనుంది.

తెలంగాణలో ఉదయం 4 గంటల నుంచి అన్ని థియేటర్లలో షోలు ప్రదర్శితం కానున్నాయి.

హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్లలో దేవర అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.

దేవర1 హిట్ గా నిలిచి టాలీవుడ్ ఖ్యాతిని పెంచాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.మెయిన్ సెంటర్స్ లో దేవర ఫస్ట్ డే టికెట్స్ దొరకడం కష్టమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr.NTR ) యాక్టింగ్ స్కిల్స్ కు ప్రేక్షకులు ఫిదా కావడం ఖాయమని తెలుస్తోంది.

దేవర సినిమా రికార్డ్ స్థాయి థియేటర్లలో రిలీజ్ అవుతుండగా ఏపీలో కూడా ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకావడం గమనార్హం.