దేవర మూవీలో రియల్ సంఘటన.. ఆ ఊచకోత ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Young Tiger Jr.NTR )దేవర సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

దేవర సినిమా కథ, కథనం ఏ విధంగా ఉండబోతున్నాయనే చర్చ ప్రేక్షకుల మధ్య జరుగుతోంది.

అయితే కారంచేడు ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందనే కామెంట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

చాలా సంవత్సరాల క్రితం కారంచేడులో జరిగిన ఊచకోత ఘటన ఈ సినిమాకు స్పూర్తి అని సమాచారం.

అయితే వైరల్ అవుతున్న వార్తలు నిజమో కాదో తెలియాలంటే మాత్రం ఈ సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.

ఒక వర్గానికి కాపు కాసే వ్యక్తిగా ఈ సినిమాలో తారక్ కనిపించనుండగా ఎన్టీఆర్ మరో పాత్రకు సంబంధించిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

దేవర సినిమా ( Devara Movie )విషయంలో తారక్ కు పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ ఉందనే సంగతి తెలిసిందే.

"""/" / ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా బ్లాక్ బస్టర్ హిట్ అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో సైతం వినిపిస్తోంది.

దేవర ఫస్ట్ పార్ట్ భారీ రేంజ్ లో హిట్టైతే మాత్రమే సెకండ్ పార్ట్ పై అంచనాలు ఏర్పడతాయి.

200 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ ( 200 Crore Theatrical Business )చేసిన ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసే సినిమా కావాలని అభిమానులు సైతం ఫీలవుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ప్రతి సినిమాకు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సహ నిర్మాతగా ఉంది.

"""/" / ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ రేంజ్ ను పెంచాల్సిన బాధ్యత కూడా తారక్ పై ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

జూనియర్ ఎన్టీఆర్ స్క్రిప్ట్స్ సెలక్షన్ లో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాతే షూటింగ్ లకు వెళ్లాలని సూచనలు చేస్తున్నారని సమాచారం అందుతోంది.

దేవర మూవీ మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

కపులింగ్ ఓపెన్ చేస్తుండగా ట్రైన్‌ రివర్స్.. నుజ్జునుజ్జు అయిన రైల్వే వర్కర్..