నార్త్ అమెరికాలో అదరగొడుతున్న యంగ్ టైగర్ దేవర.. రిలీజ్ సమయానికి ఆ రికార్డ్ పక్కా!

కొరటాల శివ ( Koratala Shiva )దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం దేవర.

ఇందులో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

అయితే జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఇక విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్క అప్డేట్ ని విడుదల చేస్తూ అంచనాలను కాస్త మరింత పెంచుతున్నారు.

"""/" / ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత చేస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.

ఇంకా చెప్పాలంటే ఆ సినిమాకు మించే అంచనాలు ఉన్నాయని చెప్పవచ్చు.ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ సేల్స్ నార్త్ అమెరికాలో ఎప్పుడో ప్రారంభం అయ్యాయి.

ఈ చిత్రం నార్త్ అమెరికా( North America )లో దూకుడుగా వ్యవహరిస్తుంది.ఇప్పటి వరకూ 700కే డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది.

రిలీజ్ డేట్ కి వన్ మిలియన్ కి పైగా ఈ నంబర్ ఉండే అవకాశం ఉంది.

ఇలా నార్త్ అమెరికాలో విడుదలకు ముందే ఎన్టీఆర్ ఒకదాని తర్వాత ఒకటి రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నారు.

"""/" / ఇలాగే కంటిన్యూ అయితే సినిమా విడుదల తర్వాత రికార్డుల మీద రికార్డులు సృష్టించడం ఖాయం అని తెలుస్తోంది.

ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషన్స్ ని షురూ చేసింది.మరి భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.అంతే కాకుండా ఈ సినిమా కోసం కల్లు కాయలు కాచే విధంగా ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే ఈ ట్రైలర్ను ఈనెల 10వ తారీకు విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

దాంతో ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

బన్నీ అరెస్ట్ అయితే జానీ మాస్టర్ హ్యాపీగా ఉన్నారా.. ఆయన రియాక్షన్ ఏంటంటే?