ఆ సెంటిమెంట్ ప్రకారం దేవర మూవీ బ్లాక్ బస్టర్.. రికార్డ్స్ బ్రేక్ కావడం పక్కా!
TeluguStop.com
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు( Jr NTR ) యాక్సిడెంట్ అయిందని ఒక వార్త సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ కాగా వైరల్ అయిన వార్తలో నిజం లేదని మేకర్స్ నుంచి స్పష్టత వచ్చింది.
అయితే రెండు వారాల క్రితం జిమ్ లో వ్యాయామం చేస్తున్న సమయంలో మాత్రం తారక్ చెయ్యి బెణికిందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.
అయితే తారక్ తన సినిమా కెరీర్ లో ఇప్పటివరకు నటించిన సినిమాలలో చాలా సినిమాల షూటింగ్స్ సమయంలో షూటింగ్ లో పాల్గొనని ఇతర సమయాల్లో చిన్నచిన్న గాయాలు అయ్యాయి.
అయితే ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి నిర్మాతలకు మాత్రం మంచి లాభాలను అందించడం జరిగింది.
ఆ సెంటిమెంట్ ప్రకారం దేవర మూవీ( Devara Movie ) కూడా పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు.
దేవర సినిమాతో రికార్ద్స్ బ్రేక్ కావడం పక్కా అని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
"""/" /
బడ్జెట్ పరంగా టెక్నీషియన్స్ పరంగా దేవర ఒకింత టాప్ మూవీ కాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్( NTR Arts Banner ) కూడా ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామిగా ఉంది.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ వ్యవహారాలను ప్రస్తుతం కొసరాజు హరికృష్ణ చూసుకుంటున్నారు.తన తమ్ముడు కళ్యాణ్ రామ్ కు నిర్మాతగా కచ్చితంగా భారీ హిట్లు దక్కాలని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు.
"""/" /
దేవర సినిమాకు సంబంధించి క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదు.
ఆచార్య సినిమా ఫ్లాపైనా కొరటాల శివకు( Koratala Siva ) ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఈ సినిమాను పూర్తి చేశారని తెలుస్తోంది.
80 శాతం సక్సెస్ రేట్ ఉన్న కొరటాల శివ ఈ సినిమాతో సక్సెస్ రేట్ ను మరింత పెంచుకోవాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
వీరందరూ పేరున్న సెలబ్రిటీలే.. కానీ తెర వెనుక నీచులు..??