దేవర బెనిఫిట్ షో టికెట్ ధర తెలిస్తే గుండె ఆగిపోవాల్సిందే.. ధర ఎంతంటే?
TeluguStop.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR ) త్వరలోనే దేవర సినిమా ( Devara Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో భారీ స్థాయిలోనే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
ఒక ఈ సినిమా ఇప్పటికే అన్ని ఏరియాలలో బిజినెస్ కూడా పూర్తి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో బెనిఫిట్ షోలు( Benefit Shows ) కూడా వేయబోతున్న సంగతి తెలిసిందే.
"""/" /
ఇక ఈ సినిమా ఓవర్సీస్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ భారీ ధరలకు కొనుగోలు చేశారు.
ఇక ఈయన ఓవర్సీస్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని సెలెక్టెడ్ థియేటర్లలో ఈ సినిమా బెనిఫిట్ షోలను ఒకే సమయంలో వేయాలని నిర్ణయం తీసుకున్నారట అందుకు గాను ఇప్పటికే ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
సెప్టెంబర్ 27వ తేదీ తెల్లవారుజామున 1.08 గంటలకు బెనిఫిట్ షో వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
"""/" /
ఇక నైజాం ఏరియాలో కొన్ని సెలెక్టెడ్ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ సినిమా బెనిఫిట్ షోలు వేయబోతున్నారని అయితే ఈ బెనిఫిట్ షో టికెట్ ధరలు కూడా భారీగా ఉన్నాయని తెలుస్తోంది.
ఇలా బెనిఫిట్ షో చూడటం కోసం ఒక్కో టికెట్ కు 2000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఇలా ఒక టికెట్ ధర 2000 రూపాయలు అంటే మామూలు విషయం కాదు.
అయితే ఈ సినిమా టికెట్ల విషయంలో నాగ వంశీ పై భారీ స్థాయిలో ఒత్తిడి ఉన్న నేపథ్యంలోనే ఇలా రేట్లు కూడా పెరిగాయని తెలుస్తుంది.
ఎన్టీఆర్ కొరటాల ( Koratala ) కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్న నేపథ్యంలోనే టికెట్ రేట్లు కూడా భారీగా పెంచేశారు.
అయితే ఇదివరకు వీరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
వైరల్ వీడియో: ఏనుగుకు తిక్క రేగితే ఇలాగే ఉంటుంది మరి