జపాన్ లో ఆ తేదీన రిలీజ్ కానున్న దేవర.. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా?
TeluguStop.com
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,( Jr NTR ) జాన్వీ కపూర్( Janhvi Kapoor ) కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర మూవీ( Devara ) వెండితెరపై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందించిందని చెప్పవచ్చు.ఈ సినిమాలో దేవర, వర పాత్రల్లో తారక్ అద్భుతమైన అభినయంతో ప్రేక్షకులను మెప్పించారు.
కొరటాల శివ ఈ సినిమా సక్సెస్ తో ఇండస్ట్రీలో పూర్వ వైభవాన్ని సొంతం చేసుకున్నారు.
దేవర సినిమా సీక్వెల్ దేవర2( Devara 2 ) కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు అప్ డేట్స్ వస్తాయో చూడాల్సి ఉంది.
దేవర మూవీ జపాన్ లో( Japan ) మార్చి నెల 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.
ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలలో ఒకటైన ట్విన్ ఈ సినిమాను జపాన్ లో రిలీజ్ చేస్తుండటం గమనార్హం.
జపాన్ లో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. """/" /
దేవర సినిమాకు జపాన్ లో సైతం అదిరిపోయే రెస్పాన్స్ రావడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
దేవర సీక్వెల్ 2027 సంవత్సరంలో థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
దేవర1 బాక్సాఫీస్ వద్ద 550 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.
పెంచిన టికెట్ రేట్లు ఈ సినిమాకు ఒకింత ప్లస్ అయ్యాయి. """/" /
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్2 సినిమాతో బిజీగా ఉన్నారు.
వార్2 సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైందని త్వరలో ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల కానుందని సమాచారం అందుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటుండగా కెరీర్ పరంగా సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
దేవర2 స్క్రిప్ట్ పనులు ఇప్పటికే మొదలయ్యాయని సమాచారం అందుతుండటం గమనార్హం.