దేవర మూవీ ఐదో రోజు కలెక్షన్లు లెక్కలు ఇదే.. ఎన్టీఆర్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారుగా!

జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )హీరోగా నటించిన తాజా చిత్రం దేవర.

కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వన్ మెన్ షో, అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలిచాయి.

సినిమా చూసి బయటకి వస్తోన్న ఆడియన్స్ లలో ఎక్కువగా ఈ రెండు విషయాలని ప్రస్తావిస్తున్నారు.

"""/" / ఇదిలా ఉంటే ఈ సినిమాకి సోమవారం తెలుగు 5+ కోట్ల షేర్ వచ్చింది.

ఐదో రోజు కూడా 5.55 కోట్ల షేర్ ఈ సినిమాకి రావడం విశేషం అని చెప్పాలి.

అలాగే నైజాంలో 2.37 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ఐదో రోజు వచ్చాయి.

ఓవరాల్ గా ఇప్పటి వరకు 37.75 కోట్ల షేర్ కలెక్షన్స్ ని దేవర మూవీ నైజాంలో వసూళ్లు చేసిందని చెప్పవచ్చు.

ఇకపోతే సీడెడ్ చూసుకుంటే ఐదో రోజు 1.22 కోట్ల వసూళ్లు చేస్తే ఓవరాల్ గా ఇప్పటి వరకు 20.

63 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోగలిగింది.వైజాగ్ లో ఐదో రోజు 58 లక్షలు కలెక్షన్స్ సాధించగా, ఓవరాల్ గా 10.

21 కోట్ల షేర్ కలెక్షన్స్ ని వసూళ్లు చేసింది. """/" / ఇక తూర్పు గోదావరిలో ఐదో రోజు 29 లక్షలు, పశ్చిమ గోదావరిలో 24 లక్షలు, కృష్ణా జిల్లాలో 30 లక్షలు, గుంటూరులో 29 లక్షలు, నెల్లూరులో 26 లక్షల షేర్ ని దేవర సినిమా ఐదో రోజు కలెక్ట్ చేసిందని చెప్పాలి.

ఓవరాల్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం 98.64 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది.

అక్టోబర్ 2 గాంధీ జయంతి పబ్లిక్ హాలిడే వచ్చింది.తరువాత కూడా వరుసగా దసరా సెలవులు కలిసి రాబోతున్నాయి.

ఈ నేపథ్యంలో దేవర కలెక్షన్స్ మరల పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇదే స్పీడ్ లో మూవీకి వసూళ్లు వస్తే ఈ వీకెండ్ కు దేవర వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 500 కోట్లకి చేరుకుంటాయని భావిస్తున్నారు.

రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ పై ఎమోషనల్ కామెంట్స్ చేసిన చిరు… ఇద్దరూ అంటూ?