రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర సంచలన రికార్డులు.. ఎవరికీ సాధ్యం కాదంటూ?

ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ ఏ సినిమా అనే ప్రశ్నకు ఏ మాత్రం తడుముకోకుండా కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD ) అని చెబుతారు.

అయితే ఈ సినిమా తర్వాత రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమా ఏదనే ప్రశ్నకు దేవర సినిమా పేరు జవాబుగా చెప్పవచ్చు.

వీకెండ్స్, వీక్ డేస్ అనే తేడాల్లేకుండా కలెక్షన్ల విషయంలో దేవర మూవీ( Devara Movie) అదరగొట్టింది.

అటు ఏపీ ఇటు తెలంగాణలో దేవర కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించింది. """/" / రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర సంచలన రికార్డులు సొంతం చేసుకోవడం అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.

25 రోజుల రన్ తో దేవర ఏపీలో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోగా తెలంగాణలో 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.

అయితే ఏపీలో ఈ సినిమా సాధించిన షేర్ కలెక్షన్లు జీఎస్టీతో కలిపి సాధించిన కలెక్షన్లు కావడం గమనార్హం.

"""/" / దేవర సినిమాకు సొంతమైన రికార్డులు మరే సినిమాకు ఇప్పట్లో సాధ్యం కాదంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దేవర సినిమా న భూతో న భవిష్యత్ అనే రికార్డులను సొంతం చేసుకుంటూ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.

దేవర సినిమా బళ్లారి టౌన్ లో ఏకంగా 1.25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.

దేవర రికార్డ్స్ ఫ్యాన్స్ కు కలిగిస్తున్న ఆనందం మాత్రం అంతాఇంతా కాదు.ఓవర్సీస్ లో, ఇతర రాష్ట్రాల్లో దేవర మూవీ ప్రభంజనం మామూలుగా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

దేవర ఎన్టీఆర్ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కు ప్రూఫ్ గా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

దేవర సినిమాకు సరైన రిలీజ్ డేట్ దొరకడం మరింత ప్లస్ అయింది.వాయిదా పడటమే ఈ సినిమాకు మరింత మేలు చేసిందని చెప్పవచ్చు.

రోజూ రొట్టెలు పెట్టిన మహిళకు కన్నీటి వీడ్కోలు పలికిన మూగజీవం.. వీడియో చూస్తే!