దేవర సీక్వెల్ కు మూహూర్తం ఫిక్స్ అయిందట.. 2025లోనే తారక్ శుభవార్త చెప్పనున్నారా?
TeluguStop.com

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) హీరోగా నటించిన తాజా చిత్రం దేవర( Devara ).


మొత్తానికి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని వాటన్నింటినీ దాటుకొని సినిమా గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.


ఈ సినిమా ట్రైలర్ చూసినపుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం అంచనాలను తగ్గించేసుకున్నారు.
పైగా రిలీజ్ రోజు టాక్ ఏమంత గొప్పగా లేదని చెప్పాలి.సినిమా చూసిన వాళ్లు బాలేదు అనలేదు కానీ, అదిరింది అనే స్టేట్మెంట్స్ కూడా ఇవ్వలేదు.
ఓవరాల్‌గా యావరేజ్ టాకే వచ్చింది. """/" /
అయినా సరే రిలీజ్ టైమింగ్, ఇంకా వేరే అంశాలు కలిసి వచ్చి ఈ సినిమా ఉన్నంతలో బాగానే ఆడేసింది.
దానికి తోడు ఎన్టీఆర్ కి ఉన్న మాస్ క్రేజ్ కారణంగా ఈ సినిమాను చూడడం కోసం ప్రేక్షకులు కూడా క్యూ కట్టారు.
ఇక వీకెండ్ తర్వాత కొంచెం డల్ అయినా దసరా సెలవులు కలిసి రావడంతో సినిమా ఒక మోస్తరు వసూళ్లతో సాగిపోయింది.
కొన్ని చోట్ల సినిమా లాభాల బాట కూడా పట్టింది.కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్‌కు దగ్గరగా ఉంది.
మొత్తంగా సినిమాకు పాజిటివ్ రిజల్ట్ రావడంతో దేవర 2 ఉంటుందా లేదా అనే విషయంలో సందేహాలు తొలగిపోయినట్లే అయ్యింది.
కచ్చితంగా పార్ట్ 2 ఉంటుందని ఒక అంచనాకు వచ్చేసారు. """/" /
మరి దేవర పార్ట్ 2ఎప్పుడు ఉంటుంది అనే ప్రశ్న అభిమానులను కలవరపెడుతోంది.
ఈ సినిమా ఇప్పుడు మొదలవుతుంది అనేది మూవీ మేకర్స్( Movie Makers ) కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు.
కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాను ఈ ఏడాది ఆఖరిలోపు సెట్స్ మీదకు తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
వచ్చే ఏడాది దసరా లేదంటే క్రిస్మస్ పండగకు ఈ పండుగను విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారట.
రెండో భాగానికి టెక్నికల్ టీంలో కొన్ని మార్పులు ఉండొచ్చని సమాచారం.
ఈ వారం థియేటర్స్, ఓటీటీ సినిమాలు ఇవే.. ఆ క్రేజీ సినిమాల జాబితా ఇదే!