ఆది పురుష్ సినిమాలో హనుమంతుడుగా నటించిన నటుడు ఎవరో తెలుసా?
TeluguStop.com
దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నటువంటి ఆది పురుష్ సినిమా నుంచి బిగ్ అప్డేట్ విడుదల చేశారు.
అయోధ్యలోని సరియు నది తీరాన ఈ సినిమా టీజర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఘనంగా టీజర్ లాంచ్ చేశారు.
ఇక ఈ టీజర్ లాంచ్ అయినా కొన్ని నిమిషాలలోనే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది.
రామాయణం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించగా సీతమ్మగా కృతీసనన్ కనిపించనుంది.
ఇక రావణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించినన్నారు.ఇలా రామాయణం నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో ప్రధాన పాత్రల గురించి దర్శకుడు ముందుగా ప్రకటించినప్పటికీ ఈ చిత్రంలో కీలక పాత్ర అయినటువంటి హనుమంతుడి పాత్రలో నటించే నటుడు గురించి ఎక్కడ ప్రస్తావించలేదు అయితే తాజాగా టీజర్ విడుదల చేయగా ఇందులో హనుమంతుడి పాత్రను కూడా ఎంతో అద్భుతంగా చూపించారు.
ఈ క్రమంలోనే ఈ హనుమంతుడి పాత్రలో నటించిన నటుడు ఎవరు అంటూ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.
"""/"/
ప్రభాస్ సినిమాలో హనుమంతుడి పాత్రలో నటించిన ఈ నటుడి పేరు దేవదత్త గజానన్ నాగే.
ఈయన మరాఠీ సీరియల్స్ లో నటించి ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.అదేవిధంగా జై మల్హర్ సీరియల్లో లార్డ్ కండోబా పాత్రలో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.
ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే వీర్ శివాజీ, దేవయాని, బాజీరావ్ మస్తానీ వంటి సినిమాలలో నటించిన దేవదత్త తాజాగా ఆది పురుష్ సినిమాలో నటించే అవకాశం అందుకున్నారు.
"""/"/
ఇకపోతే దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన తాన్హాజీ.ది అన్ సంగ్ వారియర్ చిత్రంలో కూడా నటించడంతో ఈయనకు ఈ సినిమాలో అవకాశం కల్పించారు.
ఇకపోతే ఈ సినిమాలో దేవదత్త పాత్ర ఎంతో కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది.ఇక హనుమంతుడిని భక్తితో కొలిచే ఈయన 17 సంవత్సరాల వయసులోనే వ్యాయామం చేయడం ప్రారంభించడమే కాకుండా తన తొలి జిమ్ సెంటర్ కి హనుమాన్ వ్యాయామశాల అనే పేరు పెట్టినట్లు ఓ ఇంటర్వ్యూ సందర్భంగా దేవ దత్త వెల్లడించారు.
ఈ విధంగా హనుమంతుడిని కొలిచే ఈయనకు రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో హనుమంతుడి పాత్రలో నటించే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని ఈయన వెల్లడించారు.
అయ్యబాబోయ్.. మీరు ఎప్పుడైనా ఇలాంటి గుడ్లను చూసారా?