స్మశాన వాటిక, వరి కల్లలా ఏర్పాట్లు కు హద్దుల నిర్ణయంకు శ్రీకారం..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి కేశవ పెరమండ్ల గుట్ట వద్ద గల 14 ఎకరాల గుట్ట భూమికి హద్దులు నిర్ణయించడానికి సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి శ్రీకారం చుట్టారు.

ఇటీవల సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి అధ్యక్షతన జరిగిన గ్రామ పాలకవర్గ సమావేశములో ఇట్టి ప్రదేశంలో స్మశాన వాటిక నిర్మాణం చేయాలని తీర్మానించారు.

సోమవారం ఎల్లారెడ్డి పేట సింగిల్ విండో సమావేశంలో ప్రతి ఏటా సింగిల్ విండో ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్ర నిర్వహణ జరుగుతుంది.

ఇక్కడ రైతులు వడ్లు ఆరబోయడానికి ఇబ్బందులు పడుతున్నారనీ వరి కల్లాలు ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ మహాజన సభ దృష్టికి తీసుకు వెళ్ళారు.

కాగా ఇటు స్మశాన వాటిక నిర్మాణం కు హద్దులు ఏర్పాటు చేయాలని, అనంతరం వరి కల్లాలను చేయాలని నిర్ణయించారు.

మండల సర్వేయర్ చామంతి కి హద్దులు గురువారం వరకు ఏర్పాటు చేయాలని సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి సూచించారు.

సర్పంచ్ వెంకట్ రెడ్డి వెంట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, వార్డు సభ్యులు ద్యాగం లక్ష్మినారాయణ, పందిర్ల శ్రీనివాస్,మాజీ వార్డు సభ్యులు బాధ రమేష్ రైతులు మంకెన చంద్రా రెడ్డి,వీరేశం అల్లం దేవయ్య తో పాటు రైతులు పాల్గొన్నారు.

ఈ ఇయర్ సెకండాఫ్ లో సందడి చేయనున్న మన స్టార్ హీరోలు…