ఎన్టీఆర్ 5వ కొడుకు అయినా తారక రత్న తండ్రిని ఎప్పుడైనా చూసారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు లాంటి అగ్రహీరోలు ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో చాలా మంది హీరోలు వచ్చినప్పటికీ కొంతమంది మాత్రమే హీరోలుగా ఇక్కడ నిలబడ్డారు.

అందరికంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ చాలా సినిమాల్లో నటించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.

అలాంటి ఎన్టీఆర్ చేయని పాత్ర లేదు, వేయని వేషం లేదు, అనుభవించని హోదా లేదు.

ఎన్టీఆర్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ హీరోగా వచ్చి అగ్రహీరోగా ఇప్పటివరకు కొనసాగుతున్నాడు.

బాలకృష్ణ కెరియర్ లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్, సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి.

ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఒక పవర్ ఫుల్ యాక్షన్ సినిమా చేస్తున్నారు.

అయితే నందమూరి వంశం నుంచి బాలకృష్ణ హీరోగా వస్తే ఎన్టీఆర్ ఐదవ కుమారుడు అయిన మోహన్ కృష్ణ మాత్రం ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీకి వచ్చాడు ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో బ్రహ్మర్షి విశ్వామిత్ర, గొప్పింటి అల్లుడు, భార్గవరాముడు, అనురాగ దేవత లాంటి సినిమాలు ఉన్నాయి.

మోహన్ కృష్ణ, ఎన్టీఆర్ సినిమాలను చేస్తూ తమ్ముడు అయిన బాలకృష్ణ సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేశాడు.

అయితే ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో కొన్ని సినిమాలు సరిగా ఆడక పోయేసరికి ప్రొడ్యూస్ చేయడం ఆపేసాడు.

"""/"/ మోహన్ కృష్ణ కొడుకైన తారకరత్న హీరోగా ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

ఆ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఆయన కెరియర్ ముందుకు సాగలేదు దాంతో కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఆ తర్వాత రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన అమరావతి సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపు సాధించాడు.

అయితే తారకరత్న ఆల్రెడీ ఒక పెళ్లి అయిన అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు ఈ పెళ్ళికి ఇంట్లో వాళ్ళు అంగీకరించకపోవడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి పెళ్లి చేసుకొని ఉంటున్నాడు ప్రస్తుతం తారకరత్న కి ఒక కొడుకు కూడా ఉన్నాడు.

ఇదిలా ఉంటే బాలకృష్ణ తర్వాత అంత పెద్ద అగ్రహీరోగా ఇండస్ట్రీలో వెలుగొందుతున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాలి.

ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా గుర్తింపు సాధించి నటనలో తనను మించిన వారు ఎవరూ లేరని ప్రస్తుత జనరేషన్ హీరోలకి సవాల్ విసురుతున్నాడు టెంపర్ లాంటి సినిమా లో చూస్తే ఎన్టీఆర్ నటనకు సంబంధించిన సత్తా ఏంటో మనకు అర్థం అవుతుంది.

"""/"/ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల్ ఆర్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఇది అయిపోగానే త్రివిక్రమ్ దర్శకత్వంలో అయినను పోయిరావలెను హస్తినాకు అనే సినిమా చేయనున్నారు దీంతోపాటు కే జి ఎఫ్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ తో కూడా ఒక సినిమాకు కమిట్ అయ్యారు.

జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా అడపాదడపా సినిమాలు చేస్తున్నప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్టు ఒక్కటి కూడా పడట్లేదు దాంతో కళ్యాణ్ రామ్ కొంచెం వెనుకబడి పోతున్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన పటాస్ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు పొందినప్పటికీ ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ఏది ఆడకపోయేసరికి కళ్యాణ్ రామ్ సక్సెస్ ఇస్తున్నాడు గాని కంటిన్యూగా హిట్స్ ఇవ్వలేకపోతున్నారు అని అందరూ అనుకుంటున్నారు.

కళ్యాణ్ రామ్ ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ లో కొత్త దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నారు.

"""/"/ వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే బాలకృష్ణ మాత్రం తన కొడుకు అయిన మోక్షజ్ఞని ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటున్నాడు ఈ సంవత్సరం కూడా మోక్షజ్ఞ ఎంట్రీ ఉండకపోవచ్చు.

మోక్షజ్ఞ కూడా నందమూరి వంశం నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ లాగా స్టార్ హీరో అవుతాడో లేదో చూద్దాం.

మహా కుంభమేళాలో హల్చల్ చేసిన నకిలీ షేక్.. ఉతికారేసిన సాధువులు