వైకల్యం వున్నా, పరుగు పందెంలో గెలిచి స్ఫూర్తిగా నిలిచిన విద్యార్థి… మెచ్చుకోకుండా ఉండలేం!

నేటితరం బాగా అలసత్వంతో బతుకుతోంది.అన్ని అవయవాలు బాగానే వున్నా, ఇంకా ఏదో లేదన్న అసంతృప్తి వారిని వెంటాడుతోంది.

అయితే ఈ తరుణంలో కూడా పట్టుదల ఉంటే వైకల్యాన్ని సైతం జయించొచ్చని ఓ విద్యార్థి నిరూపించి అన్ని అవయవాలు సరిగ్గా వున్నవారికి స్ఫూర్తిగా నిలిచాడు.

రేసులో పాల్గొన లేని పరిస్థితిలో కూడా ట్రాక్‌పై పరుగులు పెట్టి మరీ అందరినీ విస్మయానికి గురి చేసాడు.

విద్యార్థి ధైర్యాన్ని చూసి మురిసిపోయిన టీచర్లు.అతన్ని ప్రోత్సహించి గెలిపించారు.

ఈ ఘటన కేరళలోని మలప్పురంలో జరుగగా తాజాగా వెలుగు చూసింది.పన్తళ్లూర్‌లోని ఓ హైస్కూల్‌కు చెందిన అష్రఫ్‌ అనే పదో తరగతి విద్యార్థికి క్రీడల పట్ల మిక్కిలి ఆసక్తి.

అయితే తన ‘మానసిక వైకల్యం’ దానికి బాగా అడ్డుపడేది.ఈ కారణంగా పాఠశాలలో జరుగుతున్న క్రీడా పోటీల్లో అతగాడు పాల్గొనలేకపోయాడు.

దీంతో నిరాశ చెందిన ఆ విద్యార్థిని ప్రోత్సహించేందుకు టీచర్లు అతనికి పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు.

"""/"/ అలా వచ్చిన అవకాశాన్ని అతను సానుకూలంగా మలుచుకున్నాడు.దాంతో అతను పెట్టిన పరుగులు నేటికీ ఆగలేదు.

తాజాగా ఓ పరుగుల పోటీలో ట్రాక్‌ మొత్తం సంతోషంగా పరుగులు తీసిన అష్రఫ్‌ ఆఖరికి ఫినిష్‌ లైన్‌కు చేరుకొని విజయం సాధించాడు.

అతని కృషికి మెచ్చిన స్కూల్‌ యాజమాన్యం అతనికి మెడల్‌ ఇచ్చి సత్కరించింది.కేరళ విద్యాశాఖ మంత్రి వి.

శివన్‌ కుట్టి మంగళవారం దీనికి సంబంధిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయగా.

ఈ విషయం వెలుగులోకి వచ్చింది.కాగా ఈ వీడియో ఇపుడు వైరల్ అవుతోంది.

దేవరలోని ఆ సీన్స్ లో సీనియర్ ఎన్టీఆర్ ను గుర్తు చేసిన తారక్.. అదరగొట్టారంటూ?