విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవు – ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసుల నమోదు,శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన వివరాలని అడిగి తెలుసుకొని,స్టేషన్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వారి యొక్క డ్యూటీ ల గురించి అడిగి తెలుసుకున్నా జిల్లా ఎస్పీ.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి బాధితులకు చట్టపరమైన న్యాయం చేసే విధంగా విధి నిర్వహణ ఉండాలని,ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ ప్రజలకు సమర్ధవంతమైన సేవలు అందించాలని,విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని , సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొని రావాలి అని సూచించారు.

బ్లూ కోల్ట్ ,పెట్రో కార్ సిబ్బంది 100 డయల్ కాల్స్ కి తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.

పెట్రోలింగ్ సమయంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను ప్రతి రోజు తనిఖీ చేయాలన్నారు.

విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా అధికారులు,విలేజ్ పోలీస్ అధికారులు తరచు గ్రామాలు పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతు ప్రజలకు చట్టాల మీద, డయల్100,షీ టీమ్స్, సైబర్ నేరాలు,ట్రాఫిక్ నియమాలు తదితర అంశాల మీద అవగాహన కల్పించాలని అన్నారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరి కృషి చేయాలని సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా విధులు నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు.

ఎస్పీ వెంట సి.ఐ వెంకటేశ్వర్లు, ఎస్.

ఐ అంజయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

నో ప్రాబ్లమ్.. కాల్ మీ ఆంటీ.. వైరల్ అవుతున్న తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు!