ఐఏఎస్ ఇంట్లోకి చొరబడి సస్పెండ్ అయిన డిప్యూటీ తహశీల్దార్‌!

కొన్ని రోజుల క్రితం తెలంగాణలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడిన ఘటన సంచలనం రేపింది.

తాజాగా వార్తల్లోకి ఎక్కిన స్మితా సబర్వాల్‌కు చేదు అనుభవం ఎదురైంది.ఈ మధ్యనే ఆమెను ముఖ్యమంత్రి కార్యాలయంలో నియమించారు.

ఇక స్మితా సబర్వాల్ నివాసంలోకి చొరబడిన వ్యక్తిని మేడ్చల్-మల్కాజిగిరి డిప్యూటీ తహసీల్దార్ అనంత్ కుమార్ రెడ్డిగా గుర్తించారు.

అతను ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే ఆమె వేగంగా స్పందించి అలారం మోగించింది.వెంటనే భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి నిందితుడిని పట్టుకున్నారు.

అతడిని సంబంధిత పోలీసులకు అప్పగించారు. """/"/ ఇప్పుడు తాజా వార్త ఏమిటంటే, ఈ కేసుకు సంబంధించి డిప్యూటీ తహసీల్దార్‌ను అతని స్థానం నుండి సస్పెండ్ చేశారు.

తదుపరి విచారణ కొనసాగుతోంది.ఆయన చేసింది చిన్న విషయం కాదని ఉన్నతాధికారులు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని స్మితా కోరినట్లు సమాచారం.

అనంత్ కుమార్ రెడ్డి, అతని స్నేహితుడు స్మిత నివాసానికి వెళ్లారు.రెడ్డి ఇంట్లోకి వెళ్లగా అతని స్నేహితుడు ఇంటి బయటే ఉన్నాడు.

ఇక ఇద్దరినీ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.తన ప్రమోషన్ విషయమై ఐఏఎస్ అధికారి నివాసానికి అనంత్ కుమార్ రెడ్డి వెళ్లి ఆమెతో మాట్లాడినట్లు సమాచారం.

"""/"/ అయితే ఇతరుల ఇళ్లలోకి చొరబడడం నేరం కావడంతో ట్రెస్ పాసింగ్ కింద అతనిని అరెస్ట్ చేశారు.

అంతేకాదు ఆమె సీనియర్ లేడీ ఐఏఎస్ అధికారిణి కాబట్టి పోలీసు డిపార్ట్‌మెంట్ ఈ కేసును అంత తేలికగా వదిలిపెట్టదు.

ఇక ఆ డిప్యూటీ తహసీల్దార్‌పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 458 కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

ఇక స్మితా సబర్వాల్ ముఖ్యమంత్రి కార్యాలయానికి నియమితులైన మొదటి మహిళా IAS అధికారి గా ఈ మధ్యనే వార్తల్లోకి ఎక్కారు.

Chiranjeevi : చిరంజీవి సినిమాలో విలన్ పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?