ఆ దాడి ఘటనపై సీరియస్ .. నేడు కడపకు పవన్ కళ్యాణ్
TeluguStop.com
జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నేడు కడపకు( Kadapa ) వెళ్ళనున్నారు.
ఓ ఎంపీడీవో పై వైసీపీ నాయకులు దాడి చేసిన ఘటనను సీరియస్ గా తీసుకున్న పవన్ ఆ ఎంపీడీవోను నేరుగా వెళ్లి పరామర్శించేందుకు నిర్ణయించుకున్నారు.
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేతలు గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబు పై( MPDO Jawahar Babu ) దాడికి పాల్పడ్డారు.
ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు, వైసిపి లీగల్ సెల్ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి 20 మంది అనుచరులతో మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి ఎంపీపీ ఛాంబర్ తాళం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎంపీపీ కి మాత్రమే తాళాలు ఇస్తానని ఎంపీడీవో చెప్పడంతో ఆయనపై దాడికి దిగారట.
ఎంపీడీవో కూర్చిలో నుంచి కిందకు పడిపోయిన ఆగకుండా కాళ్లతో తన్నుతూ దాడికి పాల్పడ్డారు.
దీనిపై వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థానానికి వెళ్లి వైసిపి నేతలను చెదరగొట్టారు.
"""/" /
ఈ ఘటనలో గాయపడిన ఎంపీడీవోను రాయచోటి ఆసుపత్రికి తరలించారు.సుదర్శన్ రెడ్డిని( Sudarshan Reddy ) అదుపులోకి తీసుకొని ఎస్పీ కార్యాలయానికి తరలించారు.
ఈ ఘటనకు పాల్పడిన వారికోసం పోలీసులు గాలింపు చేపట్టారు.తనకు వైసిపి నాయకులు నుంచి ప్రాణహాని ఉందని ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఎంపీడీవో జవహర్ బాబు రోధిస్తూ విజ్ఞప్తి చేశారు.
" గది తాళాలు ఇవ్వనందుకే వైసీపీ నాయకుడు సుదర్శన్ రెడ్డి అతని 20 మంది అనుచరులు నన్ను విచక్షణ రహితంగా కొట్టారు.
అడ్డుకున్న నా మేనల్లుడు పై కూడా దాడి చేశారు.దాడి తర్వాత అరగంట పాటు కార్యాలయంలోనే ఉన్నాను.
ఈరోజు రాత్రిలోగా నన్ను చంపేస్తానని సుదర్శన్ రెడ్డి బెదిరించాడు. """/" /
అతను చాలా సందర్భాల్లో అనుచరులతో వచ్చి ఎంపీపీ గదిలో మద్యం సేవించేవారు .
ఈరోజు ఉదయం గది తాళాలు ఇవ్వలేదని మూకుమ్మడిగా నాపై దాడి చేశారు " అని ఎంపీడీవో తెలిపారు.
ఇదిలా ఉంటే.వైసిపి నాయకుల దాడిలో గాయపడిన ఎంపీడీవోను ఈరోజు పరామర్శించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు ఈరోజు ఉదయం కడప రిమ్స్ కు పవన్ వెళ్ళనున్నారు .
అక్కడ ఎంపీడీవోను పరామర్శించి, ఈ ఘటనకు కారణమైన వైసీపీ నేతలకు గట్టిగానే వార్నింగ్ ఇవ్వడంతో పాటు, భవిష్యత్తులో అధికారులపై ఎవరూ దాడికి పాల్పడకుండా కఠిన చర్యలు చేపట్టేందుకు పవన్ సిద్ధమవుతున్నారు.
భారతీయులను దారుణంగా అవమానించిన కెనడియన్.. వీడియో వైరల్..