ముఖ్యమంత్రికి కోటి రూపాయల చెక్కును అందజేసిన ఉపముఖ్యమంత్రి పవన్..

గత వారం రోజుల క్రితం నుండి విజయవాడ నగరం( Vijayawada ) వరదల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

వందలాది గృహాలు నీరు చుట్టుముట్టడంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రావడానికి వీలు లేకుండా పోయింది.

దాదాపు సగం విజయవాడ నగరం పూర్తిగా నీళ్లలో జలదిబ్బగంధం అయిందని చెప్పవచ్చు.వరదలు పోటెత్తడంతో విజయవాడ నగరం కృష్ణా జలాలతో మునిగిపోయింది.

ఎప్పుడు లేనంత విధంగా కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది.ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద రికార్డు స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగింది.

ఇకపోతే వరదల్లో( Floods ) చిక్కుకున్న విజయవాడ నగరవాసులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సేవలను అందిస్తోంది.

"""/" / ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు( CM Chandrababu Naidu ) వరదలు వచ్చిన రోజు నుంచి విజయవాడలోనే ఉంటూ ప్రతి నిమిషం ప్రభుత్వ అధికారులను అలర్ట్ చేస్తూ సహాయక చర్యలను చేపడుతున్నారు.

ఇకపోతే మరోవైపు అనుకొని విధంగా వచ్చిన వరదల కారణంగా విజయవాడ నగర వాసుల సంక్షేమ సహాయం కోసం చాలామంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల రూపంలో పెద్ద మొత్తంలో డబ్బులను జమ చేస్తున్నారు.

"""/" / ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కోటి రూపాయలను విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

నేడు వినాయక చవితి పండుగ సందర్భంగా మొదట విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఉప ముఖ్యమంత్రి పూజలు చేశారు.

ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి పవన్ కళ్యాణ్ కోటి రూపాయల చెక్కును అందించారు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పై ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

ఆర్య ఫస్ట్ ఛాయిస్ బన్నీ కాదా.. సంచలన విషయాలను బయటపెట్టిన సుధీర్ బాబు!