ఆధారాలు ఉంటే రాజీనామా చేస్తానంటున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి..!!

ఏపీ సీఎం జగన్ ( CM Jagan )2019 ఎన్నికల సమయంలో మద్యపానం నిషేధమని హామీ ఇవ్వటం తెలిసిందే.

ఇదే సమయంలో మద్యపానాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం జరిగింది.అయితే అధికారంలోకి వచ్చాక అంతకుముందున్న లిక్కర్ బ్రాండ్ లను మార్చేయడం జరిగింది.

మరోపక్క లెక్కర్ లో రాష్ట్రంలో వేలకోట్లు అవినీతి జరుగుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.ఇదే సమయంలో ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పురంధేశ్వరి( Daggubati Purandeswari ) సైతం రాష్ట్రంలో లిక్కర్ పాలసీ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుందని ప్రజల ప్రాణాలు పోతున్నాయని విమర్శించడం జరిగింది.

రాష్ట్రంలో లిక్కర్ అక్రమ దందాపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని పురంధేశ్వరి హెచ్చరించడం కూడా జరిగింది.

ఈ క్రమంలో పురంధేశ్వరి చేసిన విమర్శలపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ( Deputy CM Narayanaswamy )చాలెంజ్ విసిరారు.

రాష్ట్రంలో ఎవరైనా లిక్కర్ తాగి చనిపోయినట్టు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చారు.

పురంధేశ్వరి దగ్గర లిక్కర్ నాణ్యత పై ఆధారాలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సవాల్ విసిరారు.

పురంధేశ్వరి.బీజేపీ అధ్యక్షురాలో.

టీడీపీ అధ్యక్షురాలో అర్థం కావటం లేదంటూ నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మానవులు తయారు చేసిన అత్యంత ఖరీదైన వస్తువు.. ఏంటో తెలిస్తే..