క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎన్నుకునే వారికి ఆమెజాన్ అదిరిపోయే ఆఫర్.. ఏంటంటే…
TeluguStop.com
భారత రిజర్వ్ బ్యాంక్ ( RBI ) రూ.2000 నోట్లను వెనక్కి తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ నోట్లను ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో జమ చేయవచ్చు.
ఈ గడువు త్వరలో ముగియనున్న నేపథ్యంలో, అమెజాన్ కస్టమర్లకు సులభమైన మార్గాన్ని అందించింది.
క్యాష్ ఆన్ డెలివరీ ( COD ) ఎంచుకున్న వినియోగదారులు తమ రూ.
2000 నోట్లను అమెజాన్ డెలివరీ బాయ్ తోటే సులభంగా మార్చుకోవచ్చు. """/" /
అమెజాన్( Amazon ) ద్వారా రూ.
2000 నోట్లను మార్చుకోవడానికి, మీరు ముందుగా అమెజాన్ యాప్‌లో మీ KYC వివరాలను నమోదు చేయాలి.
ఆ తరువాత, మీరు COD ద్వారా ఏదైనా ఐటమ్‌కు ఆర్డర్ పెట్టాలి.ఐటమ్ డెలివరీ సమయంలో, అమెజాన్ ఏజెంట్ మీ నుంచి రూ.
2000 నోట్లను తీసుకుని మిగిలిన మొత్తాన్ని మీ అమెజాన్ పే అకౌంట్‌లో డిపాజిట్ చేస్తాడు.
అమెజాన్ పే( Amazon Pay ) లో బ్యాలెన్స్ అప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంది కాబట్టి, మీరు వెంటనే డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేయవచ్చు.
మీరు రూ.2000 నోట్లతో సహా రోజుకు రూ.
50,000 వరకు మార్చుకోవచ్చు.అమెజాన్ పే లోని రిమైనింగ్ బ్యాలెన్స్‌తో మీరు ఆన్‌లైన్ షాపింగ్, క్యూఆర్ కోడ్ పేమెంట్స్( QR Codes ), మొబైల్ రీచార్జ్, ఫ్రెండ్స్ బంధువులకు మనీ ట్రాన్స్‌ఫర్, స్వీగ్గీ, జొమాటో వంటి వేదికల్లో పేమెంట్స్ జరపవచ్చు.
మీరు అమెజాన్ ద్వారా రూ.2000 నోట్లను మార్చుకోవాలనుకుంటే, ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.
"""/" /
స్టెప్ 1.అమెజాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలి.
స్టెప్ 2.మీ అమెజాన్ ఖాతాలో లాగిన్ కావాలి.
స్టెప్ 3.మీ KYC వివరాలను నమోదు చేయాలి.
4.COD ద్వారా ఏదైనా వస్తువుకు ఆర్డర్ చేయాలి.
5.వస్తువు డెలివరీ సమయంలో, అమెజాన్ ఏజెంట్‌కు రూ.
2000 నోట్లను ఇవ్వాలి.వారు ఐటమ్ కాస్ట్ వరకు మనీ తీసుకొని మిగిలిన మొత్తాన్ని మీ అమెజాన్ పే అకౌంట్‌లో డిపాజిట్ చేస్తారు.
పుష్ప ది రూల్ మూవీ జీఎస్టీ రీఫండ్ లెక్కలివే.. ఏకంగా అంత వెనక్కు ఇచ్చారా?