డెంగ్యూ వచ్చిన వ్యక్తులకు కరోనా సోకదా?

మనుషులు తమ తెలివితో, నైపుణ్యంతో అంచెలంచెలుగా ఎదుగుతున్నారు.ఈ రంగం, ఆ రంగం అనే తేడాల్లేకుండా అన్ని రంగాల్లో తమ ప్రతిభను చూపుతున్నారు.

వైద్యరంగంలో కూడా అనేక విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారు.అయితే పాత వ్యాధులకు మందులు కనిపెడుతున్నా కొత్త వ్యాధులు పుట్టుకొస్తూ మనుషులకు కొత్త సమస్యలు సృష్టిస్తున్నాయి.

చైనా నుంచి వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి గత కొన్ని నెలలుగా ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు.అయితే తాజాగా పరిశోధకులు కరోనా వైరస్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

బ్రెజిల్‌ కు చెందిన కొందరు పరిశోధకులు ఏ దేశాల్లో డెంగ్యూ ప్రబలిందో ఆ దేశాల్లో కరోనా ప్రభావం తక్కువగా ఉందని.

శరీరంలో ప్లేట్ లెట్స్ ను శరవేగంగా తగ్గించే డెంగ్యూ వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గిపోతుందని చెబుతున్నారు.

అయితే ఎవరైతే డెంగ్యూ బారిన పడి కోలుకుంటున్నారో వారిలోని యాంటిబాడీలు వారు కరోనా బారిన పడకుండా ఉండటానికి కారణమవుతున్నారని పేర్కొన్నారు.

డ్యూక్ వ‌ర్సిటీకి చెందిన ప్రొఫెస‌ర్ మిగుల్ నికోలెసిస్ కరోనా నుంచి ఈ విషయాలను వెల్లడించారు.

అయితే ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికను ఇంకా ప్రచురించాల్సి ఉంది.నికోలెసిస్ మాట్లాడుతూ డెంగ్యూ ప్రబలిన ప్రాంతాల్లో కరోనా ప్రభావం పెద్దగా లేదని.

డెంగ్యూ, కరోనా వైరస్ లకు శరీరంలోని ఇమ్యూనిటీ ఒకే విధంగా స్పందిస్తోందని పేర్కొన్నారు.

డెంగ్యూ కోసం ఇచ్చే వ్యాక్సిన్లను కరోనా రోగులకు ఇస్తే మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.

డెంగ్యూ, కరోనా వైరస్ లు వేరువేరు అయినప్పటికీ ఇమ్యూనిటీ విషయంలో వైరస్ లు స్పందించే తీరు ఒకే విధంగా ఉందని చెప్పారు.

తమ దేశంలో డెంగ్యూ ఎక్కువగా విజృంభించిన రాష్ట్రాల్లో కరోనా తక్కువగా విజృంభించిందని వెల్లడించారు.

ఏపీ ఎన్నికల ప్రచారంలో భారత యువజన పార్టీ అధ్యక్షుడిపై దాడి..!!