ఏపీలో రాక్షస పాలన సాగుతోంది..: చంద్రబాబు

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని ఆయన ఆరోపించారు.

ఏపీలో ఎక్కడ చూసినా గృహ హింస, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని చంద్రబాబు విమర్శించారు.మద్యానికి బానిసలుగా మారి దాడులకు పాల్పడుతున్నారన్నారు.

ప్రభుత్వం ఇసుక, మద్యం ఆదాయం చూసుకుంటుంది తప్ప రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడం లేదని మండిపడ్డారు.

అయితే వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్న చంద్రబాబు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.

పీరియడ్స్ ఆన్ టైమ్ కి రావాలంటే ఇలా చేయండి..!