నేల‌మ‌ట్టమైన నోయిడాలోని ట్విన్ ట‌వ‌ర్స్

ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ట్విన్ టవర్స్ నేలమట్టం అయ్యాయి.నిబంధ‌న‌లకు విరుద్ధంగా నిర్మించిన ఈ ట‌వ‌ర్స్ ను.

ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు అధికారులు కూల్చివేశారు.

అందుకోసం 3,700 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించారు.కేవలం 9 సెకన్ల వ్యవధిలోనే ఈ ట్విన్ టవర్స్ కుప్పకూలాయి.

2009లో సూపర్ టెక్ లిమిటెడ్ కంపెనీ ఈ ట్విన్ టవర్స్ ను రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాతిపదికన నిర్మించింది.

రూ.70 కోట్ల వ్యయంతో మూడేళ్లలో ఈ టవర్స్ నిర్మించారు.

ఈ జంట టవర్స్ లోని అపెక్స్ టవర్ ఎత్తు 102 మీటర్లు కాగా, ఇందులో 32 అంతస్తులు ఉన్నాయి.

సియాన్ టవర్స్ ఎత్తు 95 మీటర్లు.అయితే నిబంధనలను ఉల్లంఘించి దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, టవర్స్ ను కూల్చేయాలంటూ గతేడాది తీర్పునిచ్చింది.

ఈ నేపథ్యంలోనే నేడు నోయిడా ట్విన్ టవర్స్ ను అధికారులు కూల్చివేశారు.

పెళ్లి తర్వాత అక్కినేని హీరోల జాతకాలు మారతాయా.. ఈ హీరోలకు భారీ హిట్లు దక్కుతాయా?