అక్రమ నిర్మాణాల కూల్చివేత

సూర్యాపేట జిల్లా:ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నివాసాలు,దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారని తెల్లవారుజామున మున్సిపల్ అధికారులు,పోలీసుల సహాయంతో ఆక్రమిత ఇళ్లను,దుకాణాలను కూల్చివేత కార్యక్రమాన్ని హుజూర్ నగర్ పట్టణంలోని ఎస్.

బి.ఐ.

బ్యాంక్ సందులో చేపట్టారు.అందులో నివాసముంటున్న ప్రజలు ఇండ్లను,జీవనాధారమైన చిన్న చిన్న దుకాణాలను అక్రమ నిర్మాణాలంటూ పోలీసుల పహారాతో కుల్చివేయడం దారుణమని మున్సిపాల్టీ సిబ్బందితో స్థానికులు వాగ్వాదానికి దిగారు.

ముందస్తు సమాచారం లేకుండా నివాసాలను, షాపులను కూల్చివేస్తున్నారని బాధితులు లబోదిబొమంటున్నారు.

తొడలు కొడుతూ దేవుడి పాటలు.. కుస్తీతో చర్చికి క్యూ కడుతున్న జనం.. ఎక్కడంటే..?