బైడెన్ పంతం నెగ్గించే యత్నం.. అమెరికన్ బిలియనీర్లపై డెమొక్రాట్ల కన్ను , పన్ను పెంపు చర్యలు

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమెరికా పునర్నిర్మాణంతో పాటు ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అధ్యక్షుడు జో బైడెన్.

తొలుత కోవిడ్ కంట్రోల్‌కు ప్రాధాన్యత ఇచ్చిన ఆయన.వ్యాక్సినినేషన్‌ను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఆయన దేశ ఖజానా నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.ఆయన అడుగు జాడల్లోనే నడుస్తున్నారు డెమొక్రాట్లు.

దీనిలో భాగంగా సంపన్న అమెరికన్లపై పన్ను విధించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.దీని వల్ల వచ్చే ఆదాయాన్ని సోషల్ స్పెండింగ్ ప్లాన్‌ కింద ఖర్చు చేసే వీలుంది.

డెమొక్రాట్ పార్టీకి చెందిన సెనేటర్లు త్వరలోనే అమెరికన్ల స్టాక్‌లు, ఆస్తి, ఆస్తుల విలువ పెరుగుదల వంటి మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తారని సమాచారం.

అయితే పైన ఉదహరించిన ఆస్తులను విక్రయించని పక్షంలో వాటిపై ఎలాంటి పన్ను విధించబడదని తెలుస్తోంది.

కాంగ్రెస్‌లోని డెమొక్రాట్లు 2 ట్రిలియన్ డాలర్ల లోపున్న సామాజిక వ్యయ బిల్లుపై మల్లగుల్లాలు పడుతున్నారు.

పార్టీకి మద్ధతుగా వున్న కొందరు మితవాదులు .ఈ బిల్లు వల్ల కలిగే ఆర్ధిక ప్రభావాల నేపథ్యంలో ఇప్పటికే దీనిని ఆమోదించడానికి నిరాకరించారు.

అందుకే ఈ ప్లాన్ అమలుకు కావాల్సిన నిధుల సేకరణపై ప్రత్యామ్నాయ మార్గాలపై డెమొక్రాట్లు దృష్టిపెట్టారు.

దీనిపై అమెరికా ట్రెజరీ కార్యదర్శి జానెట్ యెల్లెన్ మాట్లాడుతూ.సంపన్న వ్యక్తులకు పెద్ద ఎత్తున ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న మూలధన లాభాలకు సంబంధించి వారు పన్నుల నుంచి తప్పించుకుంటున్నారని ఆరోపించారు.

డెమొక్రాట్ నేత, యూఎస్ ప్రతినిధుల స్పీకర్ నాన్సీ పెలోసీ సైతం పన్ను ప్రణాళికను స్వాగతించారు.

అయితే ఈ ప్లాన్ వల్ల ఒక దశాబ్ధకాలంలో 200 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని మాత్రమే ఆర్జించగలదని చెప్పారు.

ఇది సోషల్ స్పెండింగ్ బిల్లు మొత్తానికి ఎంతో దూరంలో వుంటుందని.అందువల్ల పార్టీ నేతలు ఇంకొన్ని మార్గాలను అన్వేషించాల్సి వుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

గత నెలలో హౌస్ వేస్ అండ్ మీన్స్ కమిటీ.అత్యధిక ఆదాయాలు పొందేవారిపై పన్ను పెంపును ప్రతిపాదించింది.

గత నెలలో, హౌస్ వేస్ అండ్ మీన్స్ కమిటీ అత్యధిక ఆదాయాలు మరియు అత్యంత లాభదాయకమైన వ్యాపారాలపై పన్నులను పెంచాలని ప్రతిపాదించింది, అయితే ఆ ఆలోచనలు దేశం యొక్క పోటీతత్వాన్ని దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేసిన మితవాద డెమొక్రాట్లు నుండి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

అమ్మో ఒకటో తారీఖు : టీడీపీ కి మళ్లీ పెన్షన్ టెన్షన్