కొత్త ట్రెండ్ సెట్ చేసిన కమలా హారిస్.. 60 ఏళ్ల సాంప్రదాయానికి చెల్లుచీటి !!

అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి.డెమొక్రాటిక్ పార్టీ తరపున కమలా హారిస్,( Kamala Harris ) రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్‌లు( Donald Trump ) తలపడుతున్నారు.

ఇప్పటికే వీరిద్దరూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.ముఖ్యంగా కమలా హారిస్ దూకుడుగా ముందుకెళ్తున్నారు.

ఓపీనియన్ పోల్స్‌తో పాటు నిధుల సేకరణ విషయంలోనూ కమల ముందున్నారు.ఇదిలాఉండగా.

ఈ ఏడాది అల్‌స్మిత్ ఛారిటీ డిన్నర్‌కు( Al Smith Charity Dinner ) గైర్హాజరు అవ్వడం ద్వారా 60 ఏళ్ల సాంప్రదాయానికి ఆమె తెరదించారు.

మాజీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం అక్టోబర్ 17న తాను ఈ డిన్నర్‌కు హాజరవుతానని చెప్పారు.

క్యాథలిక్ ఛారిటీలకు( Catholic Charities ) ప్రయోజనం చేకూర్చేందుకే ఈ విందును నిర్వహిస్తారు.

రిచర్డ్ నిక్సన్, జాన్ ఎఫ్ కెన్నెడీలు 1960 అధ్యక్ష ఎన్నికల్లో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నా.

అల్‌స్మిత్ డిన్నర్‌కు హాజరై సుహృద్భావ వాతావరణం నెలకొనేలా చేశారు. """/" / ఈ ఐకానిక్ డిన్నర్ 79వ ఈవెంట్ అతిథుల జాబితాను ఆర్చ్ డియోసెస్ ప్రతినిధి జోసెఫ్ జ్విలెంగ్( Joseph Zwillng ) వెల్లడించారు.

ఇంతలో తాను ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని కమలా హారిస్ తెలపడంతో జోసెఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆమె ఈ కార్యక్రమానికి రావడం లేదని తెలిసి తాము నిరాశ చెందామన్నారు.జాతి, మతం, నేపథ్యంతో సంబంధం లేకుండా మహిళలు, పిల్లలకు సహాయం చేసేందుకు ఈ కార్యక్రమం ఉద్దేశించినట్లుగా జోసెఫ్ పేర్కొన్నారు.

"""/" / రాజకీయ విభేదాలను పక్కనపెట్టి మరోసారి నిర్ణయాన్ని సమీక్షించాలని ఆయన కమలా హారిస్‌ను విజ్ఞప్తి చేశారు.

అయితే నవంబర్ 5 ఎన్నికల్లో అధ్యక్షురాలిగా గెలిస్తే ఇలాంటి కార్యక్రమాలకు హాజరుకావాలని ఆమె ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది.

1928లో మొట్టమొదటి రోమన్ క్యాథలిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి ఆల్ఫ్రెడ్ ఈ స్మిత్ పేరును ఈ డిన్నర్‌కు పెట్టారు.

ఈ విందు ద్వారా క్యాథలిక్ స్వచ్ఛంద సంస్థలకు మిలియన్లకొద్దీ నిధులను సమకూరుస్తుంది.అధ్యక్ష అభ్యర్ధుల మధ్య స్నేహభావాన్ని పెంపొదించడానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుంది.