బీజేపీతోనే ప్రజాస్వామ్య ప్రభుత్వం సాధ్యం.. కిషన్ రెడ్డి
TeluguStop.com
హైదరాబాద్ లోని గోల్నాకలో నిర్వహించిన ఇంటింటికీ బీజేపీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదని చెప్పారు.తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే బీఆర్ఎస్ లో చేరారని విమర్శించారు.ఈ క్రమంలో బీజేపీతోనే తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం సాధ్యమని పేర్కొన్నారు.
మోదీ నాయకత్వంలో దేశంలో స్థిరమైన ప్రభుత్వం వస్తుందని పేర్కొన్నారు.అవినీతి పార్టీలు ఏకమైతే దేశం కుక్కలు చింపిన విస్తరి అవుతుందన్నారు.
బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ నిలబడుతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు.
ఎంత డబ్బు ఇచ్చిన పుష్ప లాంటి సినిమా చేయను…స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!