గాజు గ్లాసులకు పెరిగిన డిమాండ్ ! ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులే ... కారణం ఏంటో తెలుసా..?

ఏపీలో గాజు గ్లాసులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.ఇప్పుడు యువత అంతా గాజు గ్లాసుల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వడంతో.

ప్రతి షాప్ లోనూ.స్టాక్ నిండుకుంది.

కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కూడా పెట్టేసారు.ఏంటి.

? గాజుగ్లాసుఖాలు ఇంత డిమాండ్ అనుకుంటున్నారా.? అయితే.

అదంతా జనసేన పార్టీ వల్లనే.మే లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీకి ఈసీ గాజు గ్లాసు గుర్తును కేటాయించారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ దీంతో పార్టీ గుర్తు గా ఉన్న గాజు గ్లాసును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నారు జనసైనికులు.

దీంతో పాటు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఇదే విషయాన్ని పార్టీ కేడర్‌కు చెప్పారు.

పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్తులు కూడా గ్లాసు గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పవన్ సూచించారు.

దీంతో.పార్టీ శ్రేణులు, అభిమానులుఅధిక సంఖ్యలో.

గ్లాసులను కొనుగోలు చేస్తుంటే .ఉభయ గోదావరి జిల్లా సహా ఆంధ్రాలోని పలు జిల్లాల్లో గాజు గ్లాసులకు డిమాండ్ బాగా పెరిగింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ సాధారణంగా గాజు గ్లాసు ధర రూ.10 రూపాయలు ఉంటుంది.

కానీ ఇప్పుడు ఉత్తరాంధ్ర సహా ఏపీలోని పలు జిల్లాల్లో ఈ గాజు గ్లాసు ధర 50 రూపాయల వరకు పలుకుతోందని తెలుస్తోంది.

మార్కెట్లో గ్లాసులు లేకపోవడంతో గ్లాసుల కొరత ఏర్పడింది.జనసేన కార్యకర్తలు, నాయకులు తమకు గాజు గ్లాసులు పెద్ద సంఖ్యలో కావాలంటూ కంపెనీలకు ఆర్డర్లు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఏది ఏమైనా .జనసేన పుణ్యమా అంటూ.

గాజు గ్లాసుల కంపెనీలకు.వాటిని అమ్మేవారికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

లండన్‌లోని భారత హైకమీషన్‌పై దాడి కేసు .. ఎన్ఐఏ అదుపులో ఇంద్రపాల్ సింగ్