అకీరా ఎంట్రీ ఇస్తే చాలంటున్న పవన్ అభిమానులు.. కోరిక తీరడం సాధ్యమేనా?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్( Akira Nandan ) గురించి మనందరికీ తెలిసిందే.

అకిరా నందన్ సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

దానికి తోడు గత కొద్ది రోజులుగా అది సోషల్ మీడియాలో ఇటు రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తూ బాగా వైరల్ అవుతున్నాడు అకిరా నందన్.

పవన్ కళ్యాణ్ గెలవకముందు గెలిచిన తర్వాత తండ్రి వెంటే ఉంటూ మీడియా కంట కూడా బాగానే పడుతున్నాడు.

"""/" / దాంతో ఇప్పుడు పవర్ స్టార్( Pawan Kalyan ) అభిమానులు చూపులు అకీరానందన్ వైపు వెళ్తున్నాయి.

ఎప్పుడూ లేనిది కుర్రాడు గత నెలరోజులుగా పబ్లిక్ లో బాగా ఎక్స్ పోజ్ అవుతున్నాడు.

బాబు గెలిచాక ఇంటికి వచ్చిన టైంలో, నరేంద్ర మోడీని కలిసేందుకు పవన్ ఢిల్లీకి వెళ్లిన సమయంలో, ఇటీవలే ప్రమాణ స్వీకార మహోత్సవంలో ప్రతిచోటా అకీరా కనిపించాడు.

తాజాగా సుదర్శన్ థియేటర్లో తమ్ముడు రీ రిలీజ్ స్పెషల్ షోకు వస్తే ఫ్యాన్స్ ఒక్కసారిగా చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేశారు.

గతంలోనూ చాలాసార్లు వచ్చాడు కానీ ఇలా అభిమానుల మధ్య చిక్కుకుపోవడం ఎప్పుడూ జరగలేదు.

"""/" / ఈ లెక్కన అకీరా బిగ్ స్క్రీన్ ఎంట్రీకి ముహూర్తం, అవసరం రెండూ వచ్చేసినట్టు ఉన్నాయి.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఇప్పటికేకొడుకు రంగప్రవేశం గురించి సన్నితుడైన ఒక అగ్ర నిర్మాతతో మాట్లాడి ఉంచాడట.

సరైన కథ, దర్శకుడు దొరికితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ వార్తలు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవ్వడంతో పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరి నిజంగానే అకీరా సినిమా ఇండస్ట్రీకి ఇస్తాడా ఈ విషయంలో అభిమానుల కోరిక తీరుతుందా లేదా అన్నది చూడాలి మరి.

అధికారం వచ్చినా ఆనందం లేదా ? ఎందుకిలా ?