ఈబీ-5 వీసాలకు పెరుగుతున్న డిమాండ్
TeluguStop.com
అమెరికా ప్రభుత్వం వృత్తి నిపుణులకు మంజూరు చేసే హెచ్- 1 వీసాలపై తీసుకున్న ఖటినమైన నిర్ణయం అందరికీ తెలిసిందే అదే విధంగా హెచ్ -4 స్పౌస్ వీసాలు కూడా రాదు చేయనున్న నేపద్యంలో.
ఇప్పుడు
“ఈబీ-5” వీసాలకు డిమాండ్ పెరుగుతోంది.2016 అక్టోబర్ 2017 మధ్య కాలంలో ఈ వీసాలని దాదాపుగా 174 వీసాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.
అయితే ఇదే వీసాలు గత ఏడాది 149 మాత్రమే జారీ కావడంతో ఇప్పుడు అందరూ ఈ ఈబీ -5 కి డిమాండ్ పెరుగుతోందని తెలుస్తోంది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
అయితే ఈ వీసాలనే “క్యాష్ ఫర్” వీసాగా వ్యవహరిస్తారు.
దీంట్లో అమెరికాలో స్థిర నివాసానికి దరఖాస్తు చేసుకోవాలి.(పౌరసత్వంకోసం కాదు).
దీనిలో భాగంగా అమెరికాలో కనీసం పది లక్షల డాలర్లను పెట్టుబడిగా పెట్టి ఒక సంస్థను నెలకొల్పడంతో పాటు కనీసం 10 మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుంది.
వీసా జారీ అయితే దరఖాస్తుదారునితో పాటు వారి జీవిత భాగస్వామి.21 సంవత్సరాల్లోపు పిల్లలు కూడా అమెరికాలో నివాసముండే సౌలభ్యం కలుగుతుంది.
!--nextpage
అయితే ఇదే షరతులు గ్రామీణ ప్రాంతాల్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించాలంటే మాత్రం 5లక్షల డాలర్లను పెట్టుబడిగా పెడితే చాలు అంటున్నారు అధికారులు.
అయితే రెండు ఏళ్ల క్రితం ఈ వీసా గురించి ఎవరికీ అంతగా తెలియదు ఒక వేళ తెలిసినా సరే పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.
కానీ ఇప్పుడు ఈ వీసాపైనే అందరూ దృష్టి పెడుతున్నారు.భారతీయులు సైతం ఈ వీసాలపై ఎక్కువగా మక్కువ చూపుతున్నారని అధికారులు పేర్కొన్నారు.
ఇప్పటి వరకూ వచ్చిన అప్లికేషన్స్ లో అత్యధికంగా భారతీయులవే ఉన్నాయని అంటున్నారు.2018 అనంతరం వీటి జారీ పై కూడా ఖటినమైన నిభందనలు అమలు చేసే అవకాశం ఉంది అంటున్నారు విశ్లేషకులు.
వైరల్ వీడియో: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డ్యాన్స్ తో సందడి చేసిన కలెక్టర్