అమెరికాలో పిల్లలపై కరోనా పంజా... అర్హత లేకపోవడమే శాపం అవుతోందా...!!
TeluguStop.com
అమెరికాలో కరోనా మహమ్మారి చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
కరోనా మొదటి, రెండవ వేవ్స్ లో ప్రధానంగా పెద్ద వారిపై ప్రభావం చూపగా థర్డ్ వేవ్ డెల్టా వేరియంట్ మాత్రం చిన్న పిల్లలపై పంజా విసురుతోంది.
డెల్టా మహమ్మారి కారణంగా అమెరికాలోని ఆసుపత్రులు చిన్న పిల్లలతో నిండుకుంటున్నాయి.దాంతో స్థానిక ప్రభుత్వాలకు ఏమి చేయాలో కూడా పాలుపోని పరిస్థితి నెలకొంది.
ఈ మేరకు హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ విడుదల చేసిన వివరాల ప్రకారం.
కరోనా కారణంగా ఆసుపత్రులలో చేరుతున్న పిల్లల సంఖ్య గడిచిన ఒక్క రోజులో 1900 కు చేరిందని సదరు సర్వే ప్రకటించింది.
అంతేకాదు వారం క్రితం అమెరికా వ్యాప్తంగా ఆందోళన కలిగించిన మరొక సర్వే లెక్కల ప్రకారం కేవలం వారం రోజుల వ్యవదిలో అమెరికాలో సుమారు 90 వేల మంది పిల్లలు డెల్టా వేరియంట్ బారిన పడ్డారట.
ఈ లెక్కలతో అమెరికాలోని పిల్లల తల్లి తండ్రులు ఆందోళన చెందుతుంటే మరో పక్క స్థానిక ప్రభుత్వాలు పిల్లలపై ఈ ప్రభావం తగ్గించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలోనని తలమునకలు అవుతున్నాయి.
ఇదిలాఉంటే """/"/
12 ఏళ్ళ లోపు పిల్లలకు వ్యాక్సిన్ అర్హత లేకపోవడం వారిపాలిట శాపం అవుతోందని అంటున్నారు వైద్య నిపుణులు.
ఈ నేపద్యంలో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కరోనా మొదటి రెండవ వేవ్ కంటే కూడా డెల్టా తీవ్ర ప్రభావం చూపుతోందని పిల్లలపై ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేసినపుడు పరిశోధకులు ఆ దిశగా పరిశోధనలు చేసి వారికి వ్యాక్సిన్ వేసే పరిస్థితులు కల్పించాలని కోరుకుంటున్నారు వైద్యులు.
ఇదిలాఉంటే వ్యాక్సిన్ పై శ్రద్ద చూపని ప్రాంతాలు, రాష్ట్రాలలోనే ఈ డెల్టా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉందని, వ్యాక్సిన్ ముందుగానే వేసుసుకుని ఉంటే అమెరికాపై ఈ ప్రభావం పెద్దగా ఉండేది కాదని అంటున్నారు వైద్య నిపుణులు.
మందు బాబులకు బంపర్ ఆఫర్.. మద్యం బాటిల్‌కి గుడ్డు, గ్లాస్, వాటర్ ప్యాకెట్ ఫ్రీ..