మీ అభిమాన బ్రాండ్ ‘డెల్’ నుంచి మార్కెట్లోకి వచ్చిన కొత్త ప్రొడక్ట్స్ ఇవే!

డెల్ బ్రాండ్( Dell ) గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ల్యాప్‌టాప్ కొనాలని అనుకున్నవారికి ముందుగా గుర్తొచ్చే బ్రాండ్ డెల్.

ఈ విషయంలో ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచింది.ప్రజల అవసరాలకు తగ్గట్టు మంచి స్పెసిఫికేషన్లతో కొత్త కొత్త మోడళ్లను రిలీజ్ చేస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే డెల్ టెక్నాలజీస్ తాజాగా ఇండియన్ మార్కెట్లో సరికొత్త కమర్షియల్ పోర్ట్‌ఫోలియోను పరిచయం చేయడం గమనార్హం.

"""/" / ఈ నేపథ్యంలో వరుసగా ఈ కంపెనీ ఆప్టిప్లెక్స్ ఆల్-ఇన్-వన్ డెస్క్‌టాప్, ప్రెసిషన్ మొబైల్ వర్క్‌స్టేషన్స్ (MWS), లాటిట్యూడ్ నోట్‌బుక్స్, 34 అంగుళాల అల్ట్రాషార్ప్ కర్వ్డ్ మానిటర్‌ను లాంచ్ చేయడం విశేషం.

వివిధ సంస్థల డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీని వేగవంతం చేయడానికి ఈ ప్రొడక్ట్స్ సహాయపడతాయని డెల్ కంపెనీ యాజమాన్యం పేర్కొంది.

అప్‌గ్రేడెడ్ డెల్ ఆప్టిమైజర్ ఫీచర్స్‌, 13వ జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్స్‌తో ఇవి బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తాయని పేర్కొంది.

డెల్ ఆప్టిప్లెక్స్ 7410 AIO డెస్క్‌టాప్( OptiPlex 7410 AIO ) ధర రూ.

64,500 కాగా 34-అంగుళాల అల్ట్రాషార్ప్ కర్వ్డ్ WQHD మానిటర్ రూ.56వేలకు అందుబాటులో వుంది.

"""/" / అలాగే ప్రెసిషన్ మొబైల్ వర్క్‌స్టేషన్స్ ల్యాప్‌టాప్ సిరీస్ ధరలు రూ.

76వేల నుంచి వున్నాయి.అదేవిధంగా లాటిట్యూడ్ నోట్‌బుక్స్ ల్యాప్‌టాప్ సిరీస్ ధరలు రూ.

59,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి.ఎక్స్‌పాండెడ్ డెల్ ఆప్టిమైజర్ ఫీచర్‌తో వచ్చే ఈ ప్రొడక్ట్స్.

మంచి పనితీరు కనబరుస్తాయని కంపెనీ వెల్లడించింది.లాటిట్యూడ్ నోట్‌బుక్స్( Latitude Notebooks ) సిరీస్‌లో కంపెనీ లాటిట్యూడ్ 9440 2-in-1 మోడల్‌ను పరిచయం చేయడం విశేషం.

ఈ ల్యాప్‌టాప్ ప్రపంచంలోనే అతి చిన్న 14-అంగుళాల కమర్షియల్ పిసిగా గుర్తింపు పొందింది.

ఈ స్పెసిఫికేషన్‌తో ఎగ్జిక్యూటివ్స్, కన్సల్టెంట్స్, సేల్స్ పర్స్‌కు ఇది బెస్ట్ ఆప్షన్‌గా మారనుంది.

కాబట్టి వినియోగదారులు వీటిగురించి మరింత సమాచారాన్ని డెల్ అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లి చూడగలరు.