వైరల్ వీడియో: గాల్లోకి కుక్కని ఎగరేసిన యూట్యూబర్..!

కొంద‌రు చేసే ప‌నులు చూస్తుంటే నిజంగా మ‌తి స్థిమితంలోనే ఉండి చేస్తున్నారా అనిపిస్తుంది.

వారి పైశాచిక ఆనందం కోసం వారు చేసే ఘోరాలు అలా ఉంటాయి మ‌రి.

అవి ఒక్కోసారి మితిమీరి ఇత‌రుల ప్రాణాల మీద‌కు కూడా తెస్తుంటాయి.ఇప్పుడు అలాంటి ఘ‌ట‌నే అంద‌రినీ కోపానికి గురి చేస్తోంది.

ఓ కుక్క‌పై కొంద‌రు చేసిన ప‌ని చాలా దారుణంగా ఉంది.చాలామంది జంతువులను హింసలు పెడుతూ.

ఒక్కోసారి కనికరం లేకుండా వాటి ప్రాణాలు కూడా తీస్తుంటారు.గతంలో కొందరు ఆకతాయిలు కుక్కపిల్లల్ని నిప్పుల్లో వేసి పైశాచిక ఆనందం పొందిన ఘ‌ట‌న ఎంత దుమారం రేపిందో చూశారు.

అది జ‌రిగిన త‌ర్వాత మరోచోట కోతికి ఉరివేసి చిత్ర హింసలకు గురిచేసి చంపేశారు కొంద‌రు దుర్మార్గులు.

ఇప్పుడు మ‌రోటి పెద్ద సంచ‌ల‌నంగా మారింది. """/"/ తాజాగా ఓ యూట్యూబర్ తన పెంపుడు కుక్కపై పైశాచికంగా ప్రవర్తించాడు.

మూగ‌జీవి అని కూడా చూడ‌కుండా దాన్ని చిత్ర‌హింస‌ల‌కు గురి చేశాడు.త‌న పైశాచిక ఆనందం కోసం కుక్క‌కు హైడ్రోజన్ బెలూన్లు కట్టి గాల్లోకి ఎగరేశాడు.

ఆ బెలూన్లతోపాటు కుక్కకూడా పైకి వెళ్ళింది.ఈ దారుణ‌మైన ఘటన ఢిల్లీలోని మాలవ్యనగర్ లో చోటుచేసుకుంది.

గౌరవ్ జాన్ అనే యూట్యూబర్ త‌న ఛానల్ వ్యూస్ కోసం కుక్కను ఇలా హింస‌పెట్టి దాన్ని వీడియో తీశాడు.

త‌న బర్త్ డే సందర్బంగా ఈ విధంగా చేశాడు.దీన్ని కాస్తా డ్యూట్యూబ్ లో అప్లో చేశాడు.

అంతే ఇది చూసిన వాళ్లు దుమ్మెత్తి పోశారు.చివ‌ర‌కు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దాంతో పోలీసులు యూట్యూబర్ జాన్ పై కేసు న‌మోదు చేశారు.వీరిపై జంతు ప్రేమికులు తీవ్రంగా మండిప‌డుతున్నారు.

ఇలా ఎందుకు చేశారంటూ ప్ర‌శ్నిస్తున్నారు.ఇక పోలీసులు జాన్ త‌ల్లిపై కూడా కేసును న‌మోదు చేసిన‌ట్టు స‌మాచారం.

వారంద‌రూ క‌లిసే ఇలా చేశార‌ని తెలుస్తోంది.

వైరల్ వీడియో: ఈ తల్లి గొరిల్లాకు ఆస్కార్ ఇవ్వాల్సిందే..