క్యాష్ బ్యాక్ పేరుతో సైబర్ వలలో చిక్కిన ఢిల్లీ పోలీస్ అధికారి..!

ప్రస్తుతం టెక్నాలజీ ఏ రీతిలో అభివృద్ధి చెందుతుందో అందరికీ తెలిసిందే.కానీ సైబర్ నేరగాళ్లు( Cyber ​​criminals ) టెక్నాలజీలో ఎన్ని మార్పులు వచ్చినా అమాయకులను మోసం చేసేందుకు అన్ని దారులను తెరచి ఉంచి పక్కా ప్లాన్ తో దొరికినంత వరకు దోచేస్తున్నారు.

ప్రజలను మోసం చేసేందుకు కొత్త మార్గాలను అన్వేషించి సులభంగా డబ్బులు కాజేస్తున్నారు.సైబర్ వలలో ఏకంగా ఢిల్లీ పోలీస్( Delhi Police ) అధికారి చిక్కి ఏకంగా రూ.

2,12,000 పోగొట్టుకున్నాడు.అసలు పోలీస్ అధికారిని ఎలా బురిడీ కొట్టించారో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

"""/" / ఢిల్లీ పోలీస్ విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారికి గుర్తుతెలియని అపరిచిత వ్యక్తి నుండి ఫోన్ వచ్చింది.

ఫోన్ పే నుంచి లావాదేవీలు జరపడం ద్వారా క్యాష్ బ్యాక్ ఆఫర్ వచ్చిందని నమ్మించాడు.

అయితే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందడం కోసం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని పోలీస్ అధికారికి సూచించాడు.

సైబర్ నేరగాళ్లు చెప్పిన యాప్ తరచూ క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించే యాప్ కావడంతో పోలీస్ అధికారికి ఎటువంటి అనుమానం కలగలేదు.

పైగా చట్టబద్ధమైన యాప్ గా భావించి వారు చెప్పిన యాప్ ను డౌన్లోడ్ చేశాడు.

వెంటనే ఫోన్లో ఆ యాప్ ఇన్స్టాల్ అయిన క్షణాల్లో పోలీస్ అధికారి ఫోన్ సైబర్ నేరగాళ్ల కంట్రోల్ లోకి వెళ్లింది.

"""/" / సైబర్ నేరగాళ్లు పోలీస్ అధికారి బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డ్( Bank Account, Credit Card ) నుండి ఏకంగా రూ.

2,12,000 ను కొట్టేశారు.వెంటనే బాధిత పోలీస్ అధికారి ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి నలుగురు సైబర్ నేరగాలని అదుపులోకి తీసుకున్నారు.

ఈ నేరగాళ్లు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని 5 వేరువేరు ప్రాంతాల్లో ఐదు బ్యాంక్ అకౌంట్లతో లింక్ అయినట్లు పోలీసులు గుర్తించారు.

ఇందులోని ఓ జంట ఖాతాకు నగదు రూ.2,12,000 బదిలీ చేసినట్లు గుర్తించారు.

పోలీసులు ఆ సైబర్ నేరగాళ్ల బ్యాంక్ పాస్ బుక్ లు, చెక్ బుక్ లు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకుని, బాధిత పోలీస్ అధికారి నగదు మొత్తాన్ని రికవరీ చేసి, సదరు అధికారికి అందించారు.

“ఫాస్ట్‌గా రా.. మూడ్‌లో ఉన్నా”: ఉబర్ డ్రైవర్ అసభ్య మెసేజ్‌లు.. తర్వాతేం జరిగిందో తెలిస్తే..